కంటైన్‌మెంట్‌ జోన్‌లో నిబంధనలు కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-06-03T10:33:51+05:30 IST

లక్ష్మీనర్సుపేట గ్రామంలో 8 మంది కరోనా అనుమానితులను గుర్తించి జిల్లా కేంద్రానికి తరలించిన నేపథ్యంలో గ్రామానికి ..

కంటైన్‌మెంట్‌ జోన్‌లో నిబంధనలు కట్టుదిట్టం

 పారిశుధ్య పనులు చేపట్టిన సిబ్బంది

బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్‌ పహారా

అధికారుల పర్యవేక్షణలో చర్యలు


ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 2:  లక్ష్మీనర్సుపేట గ్రామంలో 8 మంది కరోనా అనుమానితులను గుర్తించి జిల్లా కేంద్రానికి తరలించిన నేపథ్యంలో గ్రామానికి పూర్తిస్థాయిలో రాకపోకలు నిషేధించారు. కంటైన్‌మెం ట్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సోమవారం గ్రామాన్ని కలెక్టర్‌ నివాస్‌, జేసీ సుమిత్‌కుమార్‌, డీఎస్‌వో నాగేశ్వరరావు తదితర అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించి గ్రామంలోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ జోన్‌ పరిధిలో నాలుగు వైపులా రోడ్లకు అడ్డంగా కర్రలు కట్టారు.


  ప్రజలకు అవ సరమైన నిత్యావసర సరుకులన్నింటిని డోర్‌ డెలివరీ చేసే దిశలో చర్యలు చేపట్టారు. ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్య నారాయణ మంగళవారం గ్రామంలో పారిశుధ్య పనులు చేయించారు. రోడ్లను శుభ్రం చేసి బ్లీచింగ్‌ జల్లి, హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి.  


వైద్య పరీక్షలకు మరో 30 మంది తరలింపు

 గ్రామంలో కరోనా అనుమానితులు ఎనిమిది మందితో సన్నిహితంగా తిరిగిన మరో  30 మందిని మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకా కుళం తరలించినట్లు ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు తెలిపారు. మొదట గుర్తించిన 8 మంది  లక్ష్మీనర్సుపేట జంక్షన్‌ నుంచి రెండు ఆటోల్లో రావ డంతో వారిని తీసుకొచ్చిన డ్రైవర్లు, వారి కుటుంబీకులతో పాటు మరి కొంతమందిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించామన్నారు. గ్రామంలో ప్రజలతో పాటు ఇతర గ్రామాల వారు ఎలాం టి ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణ కు నిబంధనల ప్రకారం అన్ని రకాల చర్యలను చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

 లక్ష్మీనర్సుపేట గ్రామంలో కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించినందున సిబ్బంది విధుల నిర్వహనక్షల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్యాధికారి టి.ప్రవల్లిక స్పష్టం చేశారు. స్థానిక పీహెచ్‌సీలో మంగళవారం వైద్య సి బ్బంది, ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో కొన్ని వీధులను కంటై న్‌మెంట్‌ జోన్‌గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో విధులు నిర్వహించే సిబ్బంది బృందాలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేయాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. సమావేశంలో జి.పద్మావతి, వైద్యసిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T10:33:51+05:30 IST