టెన్త్‌ పరీక్ష కేంద్రాలు 329!

ABN , First Publish Date - 2020-05-23T09:31:08+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో తొలుత ఏర్పా టు చేసిన 237 పరీక్ష

టెన్త్‌ పరీక్ష కేంద్రాలు 329!

అదనంగా 92 పెంపు.. విద్యా శాఖ కసరత్తు


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 22: కొవిడ్‌-19 నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో తొలుత ఏర్పా టు చేసిన 237 పరీక్ష కేంద్రాలస్థానే 329 కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ 92 కేంద్రాల పెంపు పై డీవైఈవోల నుంచి జిల్లా విద్యా శాఖ నివేదికలు కోరింది. ఏలూరు డివిజన్‌లో తొలుత ఏర్పాటు చేసిన 51 సెంటర్లకు అదనంగా 25, తణుకు డివిజన్‌లో 45 కేంద్రా లకు అదనంగా 8, భీమవరం డివిజన్‌లో 57 కేంద్రాలకు అదనంగా 22, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 45 కేంద్రాలకు అదనంగా 24, కొయ్యలగూడెం డివిజన్‌లో 33 కేంద్రాలకు అదనంగా 19 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కొద్ది పాటి మార్పులతో దాదాపు ఇవే పరీక్ష కేంద్రాలు ఖరా రయ్యే అవకాశం ఉంది.


కొయ్యలగూడెం డివిజన్‌లో అద నపు పరీక్ష కేంద్రాల ఎంపిక నేపథ్యంలో తొలుత ఏర్పాటు చేసిన సెంటర్లలో మూడింటిని ఎత్తివేశారు. పరీక్ష గదు లు బాగా ఎక్కువగా ఉండడం, పరీక్షార్థుల మధ్య నాలుగ డుగుల భౌతికదూరం పాటించడం సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అదనపు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు పాఠశాలలను తీసుకునేందుకు ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలను సడలించారు. జిల్లాలో మొత్తం 50,027 మంది విద్యార్థులు (రెగ్యులర్‌, వన్స్‌ ఫెయిల్డ్‌) పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసు కున్నారు.


లాక్‌డౌన్‌, కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకే కల్పించారు. జిల్లాలో మొత్తం 46 వేల మంది విద్యార్థుల ఆప్షన్లు తీసుకోవాలని స్కూల్‌ హెచ్‌ఎంలకు బాధ్యతలు అప్పగించడంతో కసరత్తు జరుగుతోంది. విద్యార్థుల నుం చి ఆప్షన్లు వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయం తీసుకుని హాల్‌టిక్కెట్ల ముద్రణ చేపడతారు.

Updated Date - 2020-05-23T09:31:08+05:30 IST