బాలికలదే హవా!

ABN , First Publish Date - 2022-07-01T05:17:24+05:30 IST

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు

బాలికలదే హవా!

  • పది పరీక్షా ఫలితాల్లో వారిదే ముందంజ 
  • సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
  • కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు  
  • జిల్లాలో 90.04 శాతం ఉత్తీర్ణత 


పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలను సాధించారు. 90.04 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం సత్తా చాటారు. జిల్లాలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఈ ఏడాదీ బాలికల హవా కొనసాగింది. రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈ సారి యథావిధిగా పరీక్షలను నిర్వహించింది.


రంగారెడ్డి అర్బన్‌,  జూన్‌ 30 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. గతం మాదిరిగానే ఈ సారి కూడా అమ్మాయిలదే హవా కొనసాగింది. అత్యధికంగా బాలికలే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 47,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 42,460 మంది పాసయ్యారు. 90.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 974 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 47,157 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 24,524 మంది బాలురు, 22,633 మంది బాలికలు ఉన్నారు. 42,460 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో 21.411 మంది బాలురు, 21,049 మంది బాలికలు ఉన్నారు. 


బాలికలదే పైచేయి..

పదో తరగతి ఫరీక్ష ఫలితాల్లో బాలుర కంటే.. బాలికలే పైచేయిగా నిలిచారు. 22,633 మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయగా 21,049 మంది బాలికలు పాసయ్యారు. పాఠశాలల మేనేజ్‌మెంట్‌ వారీగా బాలికల ఫలితాలు పరిశీలిస్తే.. జడ్పీకి సంబంధించి 86.04 శాతం, ఎయిడెడ్‌ 90.4 శాతం, బీసీ వెల్ఫేర్‌లో 96.67శాతం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 70.13 శాతం, కేజీబీవీల్లో 93.57 శాతం, మోడల్‌ స్కూల్లో 96.67 శాతం, ప్రైవేట్‌ స్కూళ్లలో 93.66శాతం, రెసిడెన్షియల్‌లో 95.62శాతం, ఎస్‌డబ్ల్యుఆర్‌లో 98.88శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 


10జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వీరే..

శేరిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన గంగిశెట్టి దర్శన్‌, మహేశ్వరం జడ్పీ పాఠశాలకు చెందిన ఇందూ ప్రియ, పులిపాటి భరతసింహ, కొంగరకలాన్‌ జడ్పీ పాఠశాలకు చెందిన గంగపురం గాయత్రీ, రాయపోల్‌ జడ్పీకి చెందిన మొర్రి వైష్ణవి, దోర్నాల యశశ్విని, ఇబ్రహీంపట్నం జడ్పీ బాలిక ఉన్న పాఠశాలకు చెందిన బొల్ల ప్రగాడ హరిరత్నశ్రీ, మదీయ ఒమేమ, నేనావత్‌ అంజలి, చర్లపటేల్‌గూడ పాఠశాలకు చెందిన జక్కుల ప్రణీత, మహేశ్వరం బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన గూదె వైష్ణవి, రాగన్నగూడ స్కూల్‌కు చెందిన కస్తూరి శ్రావణి, ఆరుట్ల పాఠశాలకు చెందిన అందోజు అవంతిక, శేరిగూడ పాఠశాలకు చెందిన కొత్తకుర్మ శిరీష్‌, బూర్గుల పాఠశాలకు చెందిన పొలమోని జ్యోత్స్న, ఇర్వాన్‌ పాఠశాలకు చెందిన పల్లేటి శ్యామ్‌, చేవెళ్ల మండలం ఊరెళ్ల ఉన్నత పాఠశాలకు చెందిన ఆస్మ, మైలార్‌దేవ్‌పల్లి స్కూల్‌కు చెందిన అఫ్‌సాన రహీమ్‌, శంకర్‌పల్లి మండలం పర్వేద పాఠశాలకు చెందిన గుట్టమీది రోజా, చరికొండ పాఠశాలకు చెందిన ఎస్‌.అఖిల, షాబాద్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన బుజారం కార్తీక్‌, శంషాబాద్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన కప్పా శివర్ధన్‌గౌడ్‌, కొత్తకుర్వ స్వాతి,  పాల్మాకుల మోడల్‌ స్కూల్‌కు చెందిన బనావత్‌ చందన, మహేశ్వరం మోడల్‌ స్కూల్‌కు చెందిన కూతురు శ్రీనిధి, ఆరుట్ల మోడల్‌ స్కూల్‌కు చెందిన బి. ప్రత్యూష, చేవెళ్ల మోడల్‌ స్కూల్‌కు చెందిన కొత్తగడి సాత్విక, కుర్ల శాలిని, శంకర్‌పల్లి మోడల్‌స్కూల్‌కు చెందిన ఎర్ర నవ్యశ్రీ, కడ్తాల కేజీబీవీకి చెందిన ఈ.అనూష, సరూర్‌నగర్‌ ఎయిడెడ్‌ పాఠశాలకు చెందిన పులి అంజలి పదికి పది జీపీఏ సాధించారు.


ఆరు కేజీబీవీ స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో మొత్తం 20 కేజీబీవీ పాఠశాలలు ఉండగా అందులో ఆరు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. అందులో మొయినాబాద్‌, కేశంపేట, కొందర్గు, కడ్తాల, తలకొండపల్లి, కొందుర్గు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ ఉన్నాయి. 


మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌ హాజరు పాస్‌ శాతం

జడ్పీ 238 12,555 10,093 80.39

ఎయిడెడ్‌ 02 78 67 85.90

ఆశ్రమం 01 39 38 97.47

బీసీ వెల్ఫేర్‌ 08 585 560 95.73

ప్రభుత్వ 04 365 265 72.60

కేజీబీవీ 20 793 742 93.57

మోడల్‌ 09 873 825 94.50

ప్రైవేట్‌ 665 29,870 27,977 93.66

రెసిడెన్షియల్‌ 09 559 521 93.20

ఎస్‌డబ్ల్యుఆర్‌ 15 1,185 1,138 96.03

టీడబ్ల్యుఆర్‌ 03 255 234 91.76


----------------------------------------------------------


కేటగిరి హాజరు పాస్‌ శాతం

బాలురు 24,524 21,411 87.31

బాలికలు 22,633 21,049 93

మొత్తం 47,157 42,460 90.04

----------------------------------------------------------

ఐదేళ్లుగా పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ఫలితాల వివరాలు

సంవత్సరం హాజరు పాస్‌ శాతం

2015 88,208 61,814 70.10

2016 90,607 74,360 82.09

2017 42,706 36,164 84.68

2018 43,392 37,809 87.13

2019 45,747 42,467 92.83

----------------------------------------------------

సబ్జెక్టుల వారీగా వివరాలు

ఎల్‌-1

హాజరు పాస్‌ ఫెయిల్‌ శాతం

47,512 44,704 2808 94.09

ఎల్‌-2

47,486 47,011 475 99

ఎల్‌-3

47,507 46,848 659 98.6

మాథ్స్‌

47,516 45,314 2,202 95.37

సైన్స్‌1

47,516 45,577 1,939 95.92

సోషల్‌

47,516 46,961 555 98.83

Updated Date - 2022-07-01T05:17:24+05:30 IST