తొలి రోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2022-05-24T05:12:49+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఉన్న 41 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

తొలి రోజు ప్రశాంతం
ఉండవల్లి పరీక్షా కేంద్రంలో విద్యార్థులను తనిఖీలు చేస్తున్న అధికారి

- ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 

- 7905 మంది విద్యార్థులు హాజరు 

- 107 మంది గైర్హాజరు

- కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

గద్వాల టౌన్‌/ ఎర్రవల్లి చౌరస్తా/ వడ్డేపల్లి/ మానవ పాడు/ రాజోలి/ ఉండవల్లి/ అయిజ/ గట్టు/ మల్దకల్‌/ అలంపూర్‌/ధరూరు, మే 23 : జిల్లా వ్యాప్తంగా ఉన్న 41 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 8,012 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 7,905 మంది (98.66శాతం) హాజర య్యారు. 107 మంది గైర్హాజరయ్యారు.  గద్వాల పట్టణంలో ఏడు, మండల పరిధిలోని అనంతపురంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిది కేంద్రాల్లో 2,055 మంది విద్యార్థులకు గాను, 2036 మంది పరీక్ష రాశారు. 19 మంది గైర్హాజరయ్యారు. 


- ఇటిక్యాల మండల పరిధిలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. ఇటిక్యాల కేంద్రంలో 239 విద్యార్థులకు గాను ఒకరు గైర్హాజరయ్యారు. కొండేరు కేంద్రంలో 165 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కోదండాపురంలో 149 మంది, ఎర్రవల్లిలో 143 మంది విద్యార్థులకు నలుగురు గైర్హాజరయ్యారు. చీఫ్‌ సూపరిండెంట్‌లు చెన్నారెడ్డి, విజయ్‌భాస్కర్‌, వెంకటరంగయ్య, రమేష్‌ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.


- మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో 299 మంది విద్యార్థులకు గాను 292 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌ హృదయరాజు కేంద్రాలను పర్యవేక్షించారు.


- మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని మూడు పరీక్షా కేంద్రాల్లో  మొత్తం 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, తొమ్మిది మంది గైర్హాజ రయ్యారు. మండల విద్యాధికారి నరసింహ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.


విద్యార్థుల భవిష్యత్తుకు ‘పది’ మైలురాయి 

ప్రతీ విద్యార్థి భవిష్యత్తుకు పదవ తరగతి మైలురాయి వంటిదని, ప్రతీ ఒక్కరూ శ్రద్ధగా చదివి మంచి మార్కు లు తెచ్చుకోవాలని వడ్డేపల్లి మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కరుణసూరి అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సోమవారం చైర్‌పర్సన్‌ పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు.  


- రాజోలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 122 మంది, శ్రీసత్యంహైస్కూల్‌, ఉర్దు పాఠశాలల్లో 22 మంది మొత్తం 144 మందికి గాను, 141 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజ రయ్యారు. కేంద్రాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌ హరున్‌ రషీద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మద్దిలేటి తనిఖీ  చేశారు.


- ఉండవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. జడ్పీహెచ్‌ఎస్‌ పరీక్ష కేంద్రంలో ఒకరు, మైనారిటీ గురుకుల పాఠశాల కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పరీక్ష కేంద్ర ముఖ్య పర్యవేక్షకులు నిర్మలాజ్యోతి, అమరేందర్‌ రెడ్డి తెలిపారు.


- అయిజలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 990 మందికి గాను 969 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 21 మంది గైర్హాజరయ్యారు. తహసీల్దార్‌ యాదగిరి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.


- గట్టు మండలంలో మూడు పరీక్షా కేంద్రాలున్నాయి. మాచర్ల కేంద్రంలో 159 మంది విద్యార్థులకు గాను, 156 మంది హాజరయ్యారు. ముగ్గురు పరీక్ష రాయలేదు. గట్టు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 123 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. గట్టు బాలికల గురుకుల పాఠశాలలో 206 మందికి గాను 205 మంది హజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజర్‌ అయ్యారని ఎంఈవో కొండారెడ్డి తెలిపారు. మొత్తం 488కి గాను నలుగురు గైర్హాజ రయ్యారని చెప్పారు.

- మల్దకల్‌ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పదవ తరగతి పరీక్ష నిర్వహించారు. ఎస్‌ఐ శేఖర్‌ విద్యార్దులకు గులాబీ పూలు అందించి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్‌ సరితారాణి తనిఖీ చేశా రు. మొదటిరోజు తెలుగుపరీక్షకు 11 మంది గైర్హాజరైనట్లు ఎంఈవో కొండారెడ్డి తెలిపారు.


- అలంపూరు పట్టణంలో మొత్తం 711 మంది విద్యా ర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 706 మంది రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ హైస్కూలులో 150 మందికి గాను 149 మంది హాజర య్యారు. అలంపూరు న్యూప్లాట్స్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌  150 మంది  విద్యార్థులకుగాను, 149 మంది, హరిజనవాడ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 199 మందికి గాను 198 మంది పరీక్ష రాశారు. మాంటిస్సోరి హైస్కూల్‌లో 212 మందికి గాను 210 మంది పరీక్షకు హాజరయ్యారయ్యా రని ఎంఈవో అశోక్‌కుమార్‌ తెలిపారు.


- ధరూరులో 286 మంది విద్యార్థులకుగాను 283 మంది పరీక్షకు హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజర య్యారు. ఉప్పేరులో 285 మందికి గాను, 280 హాజరయ్యారు. ఐదుగురు పరీక్ష రాయలేదు. మార్లబీడులో 186 విద్యార్థులకుగాను 184 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇద్దరు గైర్హాజరయ్యారని ఎంఈవో  సురేశ్‌ తెలిపారు.

Updated Date - 2022-05-24T05:12:49+05:30 IST