ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-17T05:44:41+05:30 IST

పదో తరగతి పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా సూచించారు.

ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి
కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నహన్మంతరావు

 విద్యాశాఖ  ప్రిన్సిపల్‌ సెక్రటరీ  సందీ్‌పకుమార్‌ సుల్తానియా

 సంగారెడ్డి అర్బన్‌, మే 16: పదో తరగతి పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా సూచించారు.  పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనతో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సందీ్‌పకుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ.. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, వేసవికాలంలో పరీక్షలు నిర్వహిస్తునందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మాట్లాడుతూ.. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, డీఈవో నాంపల్లి రాజేశ్‌, డీటీవో కవిత, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.  సిద్దిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 81 పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్‌ మొత్తం 14,923 మంది, ప్రైవేట్‌గా 8మంది పరీక్షలు రాస్తున్నారని పరీక్షల విధులకు 800 పైచిలుకు మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.  సమీక్షలో జిల్లా విద్యాధికారి రవికాంత్‌, డీఐఈఓ సూర్యప్రకాష్‌, డీఏంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌, డీపీవో దేవకి, ఆర్టీసి, పోస్టల్‌, విద్యుత్‌ సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:44:41+05:30 IST