పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-24T05:20:14+05:30 IST

జిల్లాలో పదో త రగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్షల కోసం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పదో తరగతి పరీక్షలు ప్రారంభం
హెగాంలో విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 23: జిల్లాలో పదో త రగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్షల కోసం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా మొదటి రోజు 7వేల మంది  హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సీఎస్‌ ప్రమీలకు డీఈవో ఆశోక్‌ మెమో జారీ చేశారు. అలాగే జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పలు గదులలో విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్లు పని చేయక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో  ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,643 మంది విద్యార్థులకు 1,614 పరీక్షలు రాశారు. అలాగే ప్రయివేటు పరీక్ష రాస్తున్న 9 మంది విద్యార్థుల్లో  5 గైర్హాజరైనట్టు ఎంఈవో భిక్షపతి తెలిపారు.  ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంలను ఏర్పాటు చేశారు. 

దహెగాం: మండల కేంద్రంలోని ప్రభుత్వ పా ఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 329 మంది విద్యార్థులకు 12 మంది గైర్హాజరైనట్టు ఇన్‌చార్జి ఎంఈవో భిక్షపతి తెలిపారు. 

రెబ్బెన: మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 492 మంది విద్యార్థులకు గానూ 16 మంది గైర్హాజరైనట్టు ఎంఈవో  వెంకటేశ్వర స్వామి తెలిపారు.

బెజ్జూరు: మండల కేంద్రంలో సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. కస్తూర్భా పాఠశాల, జిల్లాపరిషత్‌ సెకండరీ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 327 మంది పరీక్షలు రాశారని ఎంఈవో రమేశ్‌ తెలిపారు. 

చింతలమానేపల్లి: మండలంలో 288 మంది విద్యార్థులు ఉండగా 17 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో సోమయ్య చెప్పారు. విద్యార్థులకు ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

జైనూరు: మండల కేంద్రంలో జిల్లా పరిషత్‌ సెకండరీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 207 మందికి గానూ ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాధికారి కుడ్మెత సుధాకర్‌ తెలిపారు. బాలికల ఆశ్రమోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 265 కి గానూ ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యాని చెప్పారు. 

కెరమెరి: మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 174 మంది పరీక్షలకు హాజర య్యారు. మోడి ఆశ్రమోన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులకు గానూ ఒకరు గైర్హాజర య్యారని ఎంఈవో సుధాకర్‌ తెలిపారు.

సిర్పూర్‌(యూ):  మండలంలోని మోడల్‌ పా ఠశాలలో 137  మంది విద్యార్థులకు గానూ ఇద్దరు గైర్హాజరయ్యారు.  మహాగాం ఆశ్రమోన్నత పాఠ శాలలో 120 మంది  విద్యారులు పరీక్షకు హజర య్యారని ఎంఈవో సుధాకర్‌ తెలిపారు.

Updated Date - 2022-05-24T05:20:14+05:30 IST