ఎన్‌టీఎ్‌సఈ పరీక్షలో టెన్త్‌ విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2021-06-18T04:58:57+05:30 IST

మండల పరిధిలోని దొ మ్మరనంద్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతు న్న ఉలసాల జయంత్‌ అ నే విద్యార్థి నేషనల్‌ టా లెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎ్‌సఈ)లో మొదటి స్థాయిలో మంచి ప్రతిభ కనబరచినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రతా్‌పరెడ్డి తెలిపారు.

ఎన్‌టీఎ్‌సఈ పరీక్షలో టెన్త్‌ విద్యార్థి ప్రతిభ
విద్యార్థితో కేక్‌ కట్‌ చేయిస్తున్న ఉపాధ్యాయ బృందం

మైలవరం, జూన్‌ 17 :మండల పరిధిలోని దొ మ్మరనంద్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతు న్న ఉలసాల జయంత్‌ అ నే విద్యార్థి నేషనల్‌ టా లెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎ్‌సఈ)లో మొదటి స్థాయిలో మంచి ప్రతిభ కనబరచినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రతా్‌పరెడ్డి తెలిపారు. గురువారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌  ఎగ్జామినేషన్‌ 2021 లో విద్యార్థి జయంత్‌  రెండు స్థాయిలలో నిర్వహించే  పరీక్షల్లో మొదటి స్థాయిలో విజయం సాధించి రెండో స్థాయికి అర్హత   పొందాడన్నారు. రెండవ స్థాయిలో అర్హత సాధిస్తే విద్యార్ధి ఉన్నత స్థాయి చదువులు పూర్తి చేసే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ లభిస్తుందన్నారు. అనంతరం శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు నరసింహులు, దానం, విద్యార్థి జయంత్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2021-06-18T04:58:57+05:30 IST