ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-08-06T22:56:29+05:30 IST

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఆర్‌‌అండ్‌‌బీ భవనంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

విజయవాడ: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఆర్‌‌అండ్‌‌బీ భవనంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేకపోయామని మంత్రి సురేష్ తెలిపారు. చాలా ఉద్యోగాలకు పదో తరగతి ఫలితాలు కీలకంగా మారాయని, పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పదోతరగతిలో గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కోరారని పేర్కొన్నారు. హైపర్ కమిటీ నియమించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎవరికీ నష్టం జరగకుండా గ్రేడ్లు నిర్ణయించామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు గ్రేడ్లు ప్రకటించినందున ఎవరికీ నష్టం ఉండదని తెలిపారు. మార్చి 2020, జూన్ 2021 ఏడాదికి సంబంధించి ఫలితాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. రాత పరీక్షలకు 70శాతం, మిగిలిన అంశాలకు 30 శాతం వెయిటేజి ప్రకారం గ్రేడ్లు నిర్ణయించామని ప్రకటించారు. మార్చి 2020లో 6,37,354 మంది, జూన్ 2021 ఏడాదిలో 6,26,981 మంది విద్యార్థులు ఉత్తీర్ణలయ్యారని సురేష్ తెలిపారు.



Updated Date - 2021-08-06T22:56:29+05:30 IST