ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-06-29T04:11:36+05:30 IST

చెన్నూరు మం డలం కిష్టంపేట, బావురావుపేట గ్రామ శివా రులలో అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రి క్తత చోటుచేసుకొంది. రెవెన్యూ, పోలీసు, అధి కారులు మంగళవారం అసైన్డ్‌ భూముల్లో ఇం డ్లు నిర్మించారని ఎక్స్‌కావేటర్లతో 150 ఇండ్లను కూల్చివేశారు. అడ్డుకున్న యజమానులను భారీగా చేరుకొన్న పోలీసు బలగాలు అడ్డుకొ న్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తం
కట్టడాలను కూల్చివేస్తున్న ఎక్స్‌కావేటర్‌

కిష్టంపేట, బావురావుపేటలో అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు

బాధితుల ఆత్మహత్యాయత్నం

పోలీసుల బలగాలతో కూల్చివేతలు

చెన్నూరురూరల్‌, జూన్‌ 28: చెన్నూరు మం డలం కిష్టంపేట, బావురావుపేట గ్రామ శివా రులలో అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రి క్తత చోటుచేసుకొంది. రెవెన్యూ, పోలీసు,  అధి కారులు మంగళవారం అసైన్డ్‌ భూముల్లో ఇం డ్లు నిర్మించారని ఎక్స్‌కావేటర్లతో 150 ఇండ్లను కూల్చివేశారు. అడ్డుకున్న యజమానులను భారీగా చేరుకొన్న పోలీసు బలగాలు అడ్డుకొ న్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బావురావు పేట సర్వే నంబరు 6, 7లో సుమారు 15 ఎక రాలు, కిష్టంపేట శివారు 149, 150 సర్వే నం బర్లలో సుమారు 32 ఎకరాల  అసైన్డ్‌ భూమి ఉంది. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో పేద బలహీన వర్గాలకు, బీసీలకు సాగు చేసు కోవడానికి పంపిణీ చేశాయి. చెన్నూర్‌ పట్టణా నికి సమీపంలో ఉండడం, నేషనల్‌హైవే రావ డంతో భూముల ధరలు పెరిగాయి. ఇందులో కొంత నేషనల్‌ హైవేలో భూమి పోగా మిగిలిన భూమిని థర్డ్‌ పార్టీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లుగా మార్చారు. వారి నుంచి ప్రజలు కొను గోలు చేసి ఇండ్లను నిర్మించుకున్నారు. అసైన్డ్‌  భూముల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు ఇండ్లను కూల్చివేశారు. కిష్టంపేటలో ఇంటిని కూల్చవ ద్దని పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇం టిపైకి ఎక్కగా పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి  తీసుకున్నారు. అలాగే మరో వ్యక్తి పెట్రోలు పోసుకోవడానికి యత్నించగా పోలీసు లు భగ్నం చేసి ఇంటిని కూల్చివేశారు. నిర్మాణా లు చేపట్టకముందే అధికారులు నోటీసులు ఇస్తే బాగుండేదని, అనుమతులు ఉన్నా కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యదర్శి ఇండ్ల అనుమతికి డబ్బులు తీసుకున్నాడని, ఆ అనుమతులు ఇక్కడి భూమికి ఇవ్వలేదని ఇప్పుడు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యదర్శి మాట్లాడుతూ  పట్టా భూమిలో నిర్మించిన కట్టడాలకు మాత్రమే పర్మిషన్‌ ఇచ్చా నని, అసైన్డ్‌ భూమిలో ఇవ్వలేదని తెలిపారు. పట్టా భూమిలో నిర్మించిన ఇంటికి ఇచ్చిన మీటర్‌ను, వాటి పత్రాలను చూపిస్తున్నారని అధికారులు తెలిపారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌ దేశ్‌పాండే, ఎంపీడీవో శ్రీనివాస్‌, సీఐలు ప్రవీణ్‌, విద్యాసాగర్‌, ఎస్‌ఐలు వెంకట్‌, చంద్రశేఖర్‌, వేమనపల్లి,  భీమారం, కోటపల్లి పోలీసులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌ పాండే మాట్లాడు తూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి లో పట్టాదారునికి మాత్రమే ఇల్లు కట్టుకోవ డానికి హక్కు ఉంటుందని తెలిపారు. పట్టాదా రులు అమ్మిన భూములు ఇతరులు కొనుగోలు చేయడంతో అవి చెల్లుబాటు కావని అక్రమ కట్టడాల కిందకు వస్తాయని తెలిపారు. 

Updated Date - 2022-06-29T04:11:36+05:30 IST