‘నకిరేకల్‌’ బీఫామ్‌ కోసం ఆశావహుల టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-04-21T06:56:16+05:30 IST

నకిరేకల్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు బీఫామ్‌ల కోసం టెన్షన్‌ పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఏ విధంగానెనా బీఫామ్‌లు దక్కిం చుకోవాలన్న తపనతో ఉన్నారు.

‘నకిరేకల్‌’ బీఫామ్‌ కోసం ఆశావహుల టెన్షన్‌.. టెన్షన్‌
నకిరేకల్‌ మున్సిపల్‌ కార్యాలయం

ఎన్నికలు పట్టించుకోని కాంగ్రెస్‌ పెద్దలు

శిబిరానికి తరలిన బీజేపీ అభ్యర్థులు 


నకిరేకల్‌, ఏప్రిల్‌ 20: నకిరేకల్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు బీఫామ్‌ల కోసం టెన్షన్‌ పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఏ విధంగానెనా బీఫామ్‌లు దక్కిం చుకోవాలన్న తపనతో ఉన్నారు.బీఫామ్‌ కోసం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యం చుట్టూ పరుగులు తీస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 20వార్డు ల కు గానూ టీఆర్‌ఎస్‌ నుంచి ప్రతి వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయడంతో బీఫామ్‌ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఎన్నికల నోటిఫికేషన్‌జారీ చేయకముందు మునిసిపల్‌ చైర్మన్‌ బీసీ మహి ళరిజర్వ్‌ అవుతుందని ప్రచారం జరగడంతో పోటీకి నిరాకరించిన నాయ కులు బీసీజనరల్‌ కావడంతో చైర్మన్‌ పదవికోసం పోటీ చేసేందుకు తీ వ్రంగా పోటీ పడుతున్నారు.ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గు రు,నలుగురు నామినేషన్లు వేసి బీఫామ్‌కోసం పోటీ ఎదురుచూ స్తున్నా రు. గెలిచే అభ్యర్థులకే బీఫామ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి వార్డులో ఇతర మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులతో సర్వే చేయించి అభ్యర్థుల ఎంపిక విషయంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్ని కోణా ల్లో కసరత్తు చేస్తున్నారు.  నకిరేకల్‌ చైర్మన్‌ పదవిని టీఆర్‌ఎస్‌ కైవసం చే సుకునేందుకు చిరుమర్తి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీనుంచి 20వార్డులకుగానూ 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఎన్నికల విషయంలో పార్టీ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆయన సైలెంట్‌గా ఉన్నారు. 


కాంగ్రెస్‌, సీపీఎం పొత్తుకు చర్చలు

పురపోరులో కాంగ్రెస్‌, సీపీఎం పొత్తు కుదుర్చుకునేం దుకు చర్చలు జరుపుతున్నారు. మంగళవారం రెండు పా ర్టీల నాయకులు పొత్తు కుది ర్చే విషయంలో సమావేశమ య్యారు. 13వార్డులకు పోటీ చేసిన సీపీఎం కు ఐదు వార్డులు కేటాయించాలని కోరడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు అందుకు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమ య్యాయి. గురువారం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉన్నందున రెండు రోజుల్లో మరోసారి సమావేశమై పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీల నాయకులు చర్చలు జరిపారు.  టీఆర్‌ఎస్‌ పార్టీని ఎన్నికల్లో దెబ్బ తీయాలంటే పొత్తులు పెట్టుకోకతప్పదని ఇరు పార్టీలూ ఒప్పందానికి వచ్చాయిజ మరోసారి రెండు పార్టీల నేతలు సమావేశమయ్యేందుకు నిర్ణయించుకున్నారు. 


శిబిరానికి కమల దళం

పుర పోరులో 20 వార్డులకు గానూ 18 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు మంగళవారం శిబిరానికి తరలివెళ్లారు. అధికార పార్టీ ప్రలోభాలకు మచ్చిక కాకుండా బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రతి వార్డు అభ్యర్థులూ పోటీలో ఉండే విధంగా బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి అభ్యర్థులను తీసుకుని శిబిరానికి తరలించారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా పోటీలో ఉండేందుకు శిబిరానికి తరలించామని 18 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలోనే ఉంటారని, ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణ ఉన్నందున ఆ లోపు బీఫామ్‌లు అందజేస్తామని బీజేపీకి చెందిన నాయకులు తెలిపారు.  


అయోమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు

నకిరేకల్‌ మునిసిపల్‌ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పెద్దలు ఎవ్వ రూ పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. నకిరేకల్‌ టౌన్‌లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకత్వం నకిరేకల్‌ విష యంలో చొరవ తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రె స్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిననాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు చెందిన నాయకు లకు ఎవ్వరికీ బాధ్య తలు అప్పజెప్పకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. కనీసం ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి రాకపోవడం, టిక్కెట్ల విషయంలో ఎవ్వరి ఇవ్వాలనే స్పష్టత లేకపోవడం తో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల్లో కల వరం మొదలైంది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ ఉన్నందు న ఆ రోజు వరకు కాంగ్రెస్‌కు చెంది న నాయకులు ఎవరు అధికార పార్టీలో చేరుతారోనన్న భయాందోళనలో స్థానిక నాయకత్వం ఉంది. నామినేషన్ల గడువు లోపైన కాంగ్రెస్‌ పెద్దలు నకిరేకల్‌ ఎన్నిక విషయం లో జోక్యం చేసుకో వాలని పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.  కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహ రించిన కొందరు నాయకులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో రోజుకో రీతిలో రాజకీయాలు తారుమారవుతున్నాయి. 


చైర్మన్‌ పీఠం కోసం ఎత్తులు

తొలి సారిగా నకిరేకల్‌ మునిసిపాలిటీగా ఏర్పడినందున తొలి చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు చైర్మన్‌ పీఠం కోసం తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి తనకే దక్కాలన్నా ఆసక్తితో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో మరీ సన్నిహితంగా మెదులుతున్నారు. చైర్మన్‌ పదవి కోసం కోసం ఒక్కటి, రెండు సీట్లు తక్కువ వచ్చినా ఎక్స్‌ అఫీషియో ఓట్లతో చైర్మన్‌ పదవి టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్న ధీమాతో పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-04-21T06:56:16+05:30 IST