గుంటూరు: జిల్లాలోని తెనాలి బోసురోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఆర్యవైశ్యులు, ముస్లిం మైనార్టీలుగా విడిపోయి ఆందోళన చేశారు. రెండు గ్రూపులుగా విడిపోయి పోటా పోటీగా నినాదాలు చేశారు. ఆర్యవైశ్యుడి షాపు కూల్చివేత ఘటనలో టీడీపీ నేతలు పరామర్శకు వెళ్లారు. దీంతో టీడీపీ వర్గీయులను అడ్డుకుని వైసీపీ మైనార్టీ వర్గానికి చెందిన నేతలు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఇరువర్గాలు పోటీ పోటీగా నినాదాలు చేశాయి. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశాయి. ఇరువర్గాలను పోలీసులు నిలువరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి