Abn logo
Oct 8 2021 @ 15:20PM

హుజురాబాద్‌లో టెన్షన్ టెన్షన్

కరీంనగర్: హుజురాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం మంచిరోజు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్ వేసేందుకు వచ్చారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున నామినేషన్ వేసేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు తరపున నామినేషన్ వేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పోటాపోటీ నినాదాలు చేశారు. నామినేషన్ కేంద్రం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఈ నెల 1న ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థు లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తొలిరోజే తన నామినేషన్‌ను వేశారు. ఇప్పటి వరకు 15 మంది నామినేషన్లు వేయగా ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా మహ్మ ద్‌ మన్సూర్‌ అలీ, బీజేపీ డమ్మి అభ్యర్థిగా ఈటల జమున, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా సిలివేరి శ్రీకాంత్‌, స్వతంత్ర అభ్యర్థులుగా రేకల సైదులు, చేరిక చంద్రశేఖర్‌, అబ్బిడి బుచ్చిరెడ్డి, నూర్జహాన్‌ బేగం, గడ్డం రమేశ్‌, పిడిశెట్టి రాజు, ఉరుమల్ల విశ్వం, కుమ్మరి ప్రవీణ్‌ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగానే పేర్కొంటూ ఒంటెల లింగారెడ్డి కూడా నామినేషన్‌ వేశారు.

ఇవి కూడా చదవండిImage Caption