Abn logo
Apr 9 2021 @ 00:25AM

భూపాలపల్లిలో ఉద్రిక్తత

ఏరియా ఆసత్తి వద్ద నిరసనకు దిగిన కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు

సింగరేణి ఆస్పత్రి వద్ద కార్మికుల ఆందోళన 

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని నిరసన 

 స్పెషల్‌ ఎక్స్‌గ్రేషియా రూ. 15.90 లక్షలు  అందజేసిన యాజమాన్యం

కాకతీయఖని, ఏప్రిల్‌ 8 : భూపాలపల్లి ఏరియాలోని కేటీ కే ఆరో గని ప్రమాదంలో మృతి చెందిన నర్సయ్య, శంకరయ్యలకు పోస్ట్‌మార్టం చేసేందుకు సింగరేణి ఏరియా ఆస్ప త్రి వద్ద మార్చురీలో భద్రపరిచారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వివిధ సంఘాలు, పార్టీల నాయకులు అక్కడి కి చేరుకుని ఆ రెండు కార్మిక కుటుంబాలకు న్యాయం చే యాలంటూ ఆందోళనకు పూనుకున్నారు. ఇందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐఎన్‌టీయూసీ నాయకులు జోగ బుచ్చయ్య, పసునూటి రాజేందర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య, టీబీజీకేఎస్‌ నాయకులు కొక్కుల తిరుపతి, మండ సంపత్‌ , బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, సీఐటీయూ నాయకుడు కంపేటి రాజయ్యతో కలిసి ఏరియా సింగరేణి ఆస్పత్రి మార్చురీ వద్ద నిరసన చేపట్టారు. గని ప్రమాదానికి పూర్తి బాధ్యత సింగరేణి అధికారులదేనని ఆరోపించారు. మృతులు నర్సయ్య, శంకరయ్య కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల నష్ట పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అంటూ చెబుతూనే కార్మికులకు ఓ న్యాయం, అధికారులకు ఓ న్యాయం సింగరేణి యాజమాన్యం చేస్తోందని విమర్శించారు. గతంలోనే ఆరో గనిలోని ప్రమాదం జరిగిన సీంలో మళ్లీ ప్రమాదం పొంచివుందని ఓ అధికారి గని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ దానిని పరిశీలించకుం డా అక్కడే పనులు చేపించడం చూస్తే అధికారుల మధ్య ఎంత సమన్వయం ఉందో అర్థమవుతోందని ఽధ్వజమెత్తారు. ఇది అధికారుల నిర్లక్ష్యపు పని విధానానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ అధికారుల తప్పి దం వల్లే గని ప్రమాదం జరిగిందని అన్నారు. గనిలో పనిస్థలాలకు వెళ్లే ముందు సంబంధిత అండర్‌గ్రౌండ్‌ అధికారులు, కింది స్థాయి రక్షణ సిబ్బంది పనిస్థలాన్ని పరిశీలించకుండానే పనులకు పురమాయించడం చూస్తే కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుకున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే విషయం తెలుసుకున్న ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌ అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. మృతుల కు టుంబాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్‌ను సకాలంలో అందేలా చేస్తామని అన్నారు. దీంతో ఆందోళన విరమించడంతో మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం పరకాలకు పంపించారు.  

మృతుల కుటుంబాలను  ఆదుకుంటాం 

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

 భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరో గనిలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంతీయ ఆస్పత్రి వద్ద కు చేరుకుని మృతుల కు టుంబ సభ్యులను పరామర్శించారు. గని ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృ తులు శంకరయ్య, నర్సయ్యల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ మేర కు ఆ కుటుంబాలకు నష్ట పరిహారం త్వరితగతిన అందేలా సింగరేణి సీ అండ్‌ ఎండి శ్రీధర్‌తో మాట్లాడానని చెప్పారు. అలాగే కార్మిక సంఘాల తరుఫున సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ త్వరలోనే అందేలా చూస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఇప్పిస్తామని అన్నారు.  

ఇది అధికారుల తప్పిదమే..

- ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ 

గనిలో జరిగిన ప్రమాధం ముమ్మాటికీ సింగరేణి అధికారుల తప్పిదమేని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ అన్నారు. గురువారం ఏరియాలోని కాకతీయ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గనిలో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తికి ఇచ్చిన ప్రా ధాన్యత కార్మికుల ప్రాణాలకు ఇవ్వడం లేదని మండిపడ్డా రు. సింగరేణి కార్మికుల రక్షణ కోసం తక్కువగా యాజమా న్యం ఖర్చు చేస్తోందని, ఈ క్రమంలోనే గని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి పనిచేస్తున్నామని ఊకదంపుడు ముచ్చట్లు చెబుతున్న ఆ సంస్థ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. నాలుగు నెలల క్రితం 6వ గనికి సంబంధించిన ఓవర్‌మెన్‌ మూడో సీం వద్ద ప్రమాదం పొంచి ఉందని లిఖిత పూర్వకంగా రాసిచ్చినప్పటికీ అధికారులు ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు గనులలో ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మృతి చెందిన కార్మిక కుటుంబాలకు టర్మినల్‌ బెనిఫిట్స్‌ కాకుండా అదనంగా రూ. కోటి పరిహారాన్ని అందించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నర్సింహారెడ్డి, రాజమౌళి, ధర్మపురి, రాజేందర్‌, బుచ్చయ్య, మధూకర్‌రెడ్డి, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.  

రూ.15.90 లక్షల స్పెషల్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లింపు 

సింగరేణి కార్మికులకు రావాల్సిన స్పెషల్‌ ఎక్స్‌గ్రేషియా రూ.15.90 లక్షల చెక్కును గుర్తింపు సంఘం (టీబీజీకేఎస్‌) నాయకులు మృతుల కుటుంబాలకు అందజేశారు. సంఘం బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి మాట్లాడుతూ కార్మికులు ప్రమాదానికి గురై మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రత్యేకంగా రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా సింగరేణి యాజమా న్యం చెల్లిస్తుందని తెలిపారు. ఈక్రమంలో అందులోంచి తక్ష ణ సహాయంగా రూ.15.90 లక్షల చెక్కును నర్సయ్య, శంకరయ్య కుటుంబాలకు అందజేసినట్లు చెప్పారు.


Advertisement
Advertisement