హైదరాబాద్: నగరంలోని వీఎన్‌ఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత మళ్ళీ మొదలైంది. కొడుకు చావును తట్టుకోలేక జాతీయ రహదారిపై వాహనాల కిందకు తల్లి పరుగుతీసింది. శివ నాగును కాలేజ్ యాజమాన్యమే చంపి బిల్డింగ్ మీద నుండి పడేసారని బంధువులు ఆరోపిస్తున్నారు. జాతి పేరుతో తనను దూషించి, తక్కువ కులం వాడు ఎక్కువ చదువులు చదవకుండా చంపేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజ్ దగ్గరకు విద్యార్థి సంఘాల నాయకులు చేరుకున్నాయి. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.
బాచుపల్లి VNR బాలుర వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఈయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ రాశాడు. ఉదయం భవనంపై అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందాడు. విద్యార్థి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి