హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో షర్మిల గ్రౌండ్ వద్దకు చేరుకోనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం గ్రౌండ్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు.