కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-24T09:05:46+05:30 IST

వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మందడంలో చేపట్టిన దీక్షకు తరలివెళుతున్న వారిని శుక్రవారం కృష్ణాయపాలెం వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

‘మూడు’కు మద్దతుగా  వచ్చినవారి అడ్డగింత


మంగళగిరి: వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మందడంలో చేపట్టిన దీక్షకు తరలివెళుతున్న వారిని శుక్రవారం కృష్ణాయపాలెం వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మూడు రాజధానులకు అనుకూలమంటూ అధికార పార్టీ ఎంపీ మందడంలో దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా మంగళగిరి, చినకాకాని, కాజ, బేతపూడి గ్రామాలకు చెందిన పలువురు దళిత మహిళలను ఆటోల్లో తరలిస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణాయపాలెం గ్రామస్థులు వారిని అడ్డుకోగా ఎంపీ అనుచరులు ఆటోలను అడ్డుకున్న వారి ఫొటోలు తీయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.


Updated Date - 2020-10-24T09:05:46+05:30 IST