కరోనా నుంచి కోలుకున్న జకోవిచ్‌

ABN , First Publish Date - 2020-07-03T01:04:57+05:30 IST

సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌, అతడి భార్యకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇటీవల సెర్బియా రాజధాని...

కరోనా నుంచి కోలుకున్న జకోవిచ్‌

బెల్‌గ్రేడ్: సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌, అతడి భార్యకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇటీవల సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్, క్రోయేషియాల్లో జరిగిన ఓ టెన్నిస్ టోర్నమెంట్‌లో జకోవిచ్‌ పాల్గొన్నాడు. టోర్నీ తరువాత జకోవిచ్‌తో పాటు అతడి భార్య జెలీనాకు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ రావడం సంచలనం రేగింది. అయితే వీరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో హోం క్వారంటైన్‌‌లో ఉన్నారు. అయితే 9 రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ డాక్లర్ల సలహా, సూచనలను పాటించడంతో ప్రస్తుతం వారిద్దరూ కరోనా నుంచి బయటపడ్డారు.


ఇదిలా ఉంటే జకోవిచ్ పాల్గొన్న టెన్నీస్ టోర్నీలో అతడితో మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ టోర్నీ నిర్వహించినందుకు నిర్వాహకులను, అందులో పాల్గొన్నందుకు ఆటగాళ్లను అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా నిందించారు. దీనిపై సెర్బియా ప్రదాని అన్నే కూడా క్షమాపణలు చెప్పుకున్నారు.

Updated Date - 2020-07-03T01:04:57+05:30 IST