బిగ్‌త్రీ సంఘీభావం

ABN , First Publish Date - 2020-06-04T09:15:45+05:30 IST

జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు టెన్నిస్‌ బిగ్‌త్రీ రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ మద్దతు ప్రకటించారు. ‘బ్లాక్‌ అవుట్‌ ట్యూస్‌డే’ ...

బిగ్‌త్రీ సంఘీభావం

న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు టెన్నిస్‌ బిగ్‌త్రీ  రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ మద్దతు ప్రకటించారు. ‘బ్లాక్‌ అవుట్‌ ట్యూస్‌డే’ క్యాంపెయిన్‌లో భాగస్వాములయ్యారు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ఓ పోలీసు.. మెడపై మోకాలితో నొక్కిపెట్టడంతో ఊపిరాడక మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. ఈ అమానవీయ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ మెసేజ్‌తో ‘నల్లటి స్ర్కీన్‌ షాట్‌’ను జొకో ఇన్‌స్టా,  ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఫెడరర్‌, నడాల్‌ కూడా అతడితో జతకలిశారు. ఇక.. వర్ణ వివక్షతతో కరీబియన్లు మైదానంలో, వెలుపలా పోరాడారని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు చెప్పింది. ఫ్లాయిడ్‌ మృతిపట్ల నిరసన గళం వినిపించిన కరీబియన్‌ ప్లేయర్లతో గొంతుకలిపింది. ప్రముఖ గోల్ఫర్‌ టైగర్‌ వుడ్స్‌, విండీస్‌ క్రికెటర్లు గేల్‌, సామి కూడా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-06-04T09:15:45+05:30 IST