Abn logo
Sep 21 2021 @ 08:34AM

తేనెటీగల దాడి... 42 మందికి గాయాలు

వేలూరు(చెన్నై): శ్మశానవాటికలో జరిగిన తేనెటీగల దాడిలో 42 మంది గాయపడ్డారు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం పుంగనూరుకు చెందిన వరద మ్మాళ్‌ ఈనెల 18న మృతిచెందింది. బంధువులు రావడం ఆలస్యం కావడంతో ఆదివారం రాత్రి 10గంటలకు మృతదేహంతో శ్మశాన వాటికకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న కొందరు కాల్చిన బాణా సంచా సమీపం లోని చెట్టుపై ఉన్న తేనెపట్టుకు తగలడంతో ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడిచేశాయి. దీంతో, మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీశారు. ఈ ఘటనలో 42 మందికి గాయాలుకాగా, వారిని కావనూరు, వేలూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం శ్మశానవాటికకు చేరుకున్న బంధువులు మృతదేహానికి అంత్య క్రియలు చేశారు.