ప్రజజాభిప్రాయం తర్వాతే ఆర్టీసీ షాపులకు టెండర్లు పిలవాలి

ABN , First Publish Date - 2022-09-27T06:58:42+05:30 IST

ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆర్టీసీ అధికారులకు సూచించారు.

ప్రజజాభిప్రాయం తర్వాతే ఆర్టీసీ షాపులకు టెండర్లు పిలవాలి
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు


మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, సెప్టెంబరు 26: ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆర్టీసీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన విలేకరులకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ బస్టాండ్‌లోని ఖాళీ స్థలం ఒక సంస్థకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టుకోవడానికి అనుమతి ఇస్తేనే తాను అడ్డుకున్నానన్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌కు వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేసుకుంటారని ప్రశ్నించారు. ఆదాయం కోసం షాపింగ్‌ కాంప్లెక్‌ నిర్మాణం చేయడం తప్పు లేదని, అయితే ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.  ప్రజాభిప్రాయం తీసుకోకపోతే అడ్డుకుంటానని అన్నారు. ప్రజలు ఇబ్బంది లేకుండా షాపులు కట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. 


Updated Date - 2022-09-27T06:58:42+05:30 IST