త్వరలోనే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు టెండర్లు

ABN , First Publish Date - 2022-05-16T05:29:20+05:30 IST

పొదిలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ టెండర్లను త్వరలో ఖరారు చే స్తామని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ చెప్పారు.

త్వరలోనే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు టెండర్లు
పైప్‌లైన్‌ వేసే మార్గాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, చీఫ్‌ ఇంజనీర్‌

పైప్‌లైన్‌ మార్గాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, చీఫ్‌ ఇంజనీర్‌

పొదిలి, మే 15 : పొదిలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ టెండర్లను త్వరలో ఖరారు చే స్తామని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ చెప్పారు. రూ.50కోట్ల నిధులతో  చేపట్టే ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు మార్గాన్ని ఆదివారం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డితో చీఫ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ పరిశీలించారు. దర్శి దగ్గర కొత్తరెడ్డిపాలెం నుంచి రాజంపల్లి, ఉన్నగురవాయపాలెం, మల్లవరం మీదుగా రోడ్డుపక్కనున్న ప్రభుత్వ స్థలంలో పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ముసివాగుపై  పి ల్లర్లను ఏర్పాటు చేసి పైప్‌లైన్‌ను అమర్చుతారని తెలిపారు. ఆ మేరకు లెవల్స్‌ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. రాజంపల్లిలో పైప్‌లైన్‌ మార్గాన్ని పరిశీలిస్తున్న సమ యంలో అక్కడి చిరువ్యాపారులు ఎమ్మెల్యే, సీఈని కలిసి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. పైప్‌లైన్‌ ఏర్పాటు చేసే సమయంలో తాత్కాలికంగా తొలగించిన తరువాత  తిరిగి యథావిధిగా వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తామని ఎ మ్మెల్యే, చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపారు.  అనంతరం పొదిలి పెద్ద చెరువును వారు పరి శీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొదిలి ప్రాం తంలో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రభుత్వం రూ.50కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. త్వరలోనే పనులు ప్రారింభించేలా చర్యలు తీసుకోవాలని సీఈని కోరారు.  వారివెంట ఎస్‌ఈ కె.లక్ష్మిరెడ్డి, డీఈ శివరామ ప్ర సాద్‌, ఏఈ రవికుమార్‌, వైసీపీ రాష్ట్రకార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్య దర్శి గొలమారిచెన్నారెడ్డి, క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ కల్లంసుబ్బారెడ్డి, ఉద్యోగ సంఘ నా యకులు వినోద్‌ ఉన్నారు.  


Updated Date - 2022-05-16T05:29:20+05:30 IST