గుజరాతీపేట, అక్టోబరు 23 : జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టేషన్లలో 51 దుకాణాలకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డివిజనల్ మేనే జర్ జి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ‘శ్రీకాకుళంలో 11, పాలకొండలో 8, నరసన్నపేట 7, ఆమదాలవలస 7, పొందూరు 4, పలాస 3, కొత్తూరులో 3, సరుబుజ్జిలి 2, సోంపేట 2, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, ఇచ్ఛాపురంలలో ఒక్కొక్కటి వంతున షాపులు ఉన్నాయి. వీటికి సంబంధించి టెండర్లు వేయనున్నాం. ఆర్టీసీ కార్యాలయ ఆవరణలో టెండర్ ఫారాలను విక్రయించనున్నాం. ఆసక్తి కలవారు ఈ ఫారాలను నింపి నవంబరు 5 మధ్యాహ్నం 2గంటలలోగా టెండర్ బాక్స్‌లో వేయాలి. అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు టెండర్ బాక్సులు తెరిచి దుకాణాలను కేటాయిస్తా’మని ఆమె తెలిపారు.