టెం‘డర్‌!’

ABN , First Publish Date - 2022-04-22T05:08:23+05:30 IST

జిల్లా కేంద్రం లో నిర్మించాల్సిన రైల్వే ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి నిర్మా ణం పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పరమైన పనులకు పోటీపడి మరి టెండర్లు వేసే కాంట్రాక్టర్లు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పనులకు ఎందుకు దూరంగా ఉంటున్నార న్నది అంతుచిక్కడం లేదని అధికారులు పేర్కొంటున్నా రు.

టెం‘డర్‌!’
తాంసి బస్టాండ్‌ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మించే ప్రదేశం



రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు
కొట్లాడి నిధులు సాధించిన ప్రయోజనం శూన్యం
నేటి నుంచి మూడో దశ టెండర్లకు అవకాశం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లో నిర్మించాల్సిన రైల్వే ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి నిర్మా ణం పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పరమైన పనులకు పోటీపడి మరి టెండర్లు వేసే కాంట్రాక్టర్లు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పనులకు ఎందుకు దూరంగా ఉంటున్నార న్నది అంతుచిక్కడం లేదని అధికారులు పేర్కొంటున్నా రు. జిల్లా కేంద్రంలో చేపట్టే రైల్వే బ్రిడ్జిల నిర్మాణం ప నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత వాతావరణం లేక పోవడం దీంతో బిల్లులు సకాలంలో వస్తాయో రావోనన్న అను మానాలే వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో తాంసి బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జితో పాటు స్పిన్నింగ్‌మిల్‌ సమీపంలో నిర్మించే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చిన ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు.
ముచ్చటగా మూడో సారి..
రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పనులకు అధికారులు ముచ్చటగా మూడోసారి టెండర్లను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి మూడో దశ ఆన్‌లైన్‌ టెండర్లకు అవకాశం కల్పించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రూ.27.63కోట్ల పనులకు గాను మొదట మార్చి 10న టెండర్లను పిలిచి మార్చి 24 వరకు అవకాశం కల్పించారు. అయినా ఎవరూ టెండరు వేసేందుకు ముందుకు రాలేదు. రెండో సారి ఏప్రిల్‌ 1 నుంచి 11వరకు అవకాశం ఇచ్చిన ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. మళ్లీ 11 రోజుల తర్వాత శుక్రవారం నుంచి మూడో దశ ఆన్‌లైన్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నా రు. దీనికి మే 6 వరకు గడువును విధించారు. అయిన టెండర్లు వస్తాయో రావోనన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. స్థానిక కాంట్రాక్టర్లకు పనులు చేపట్టేందుకు ఆసక్తి లేక పోవడం, ఇతర ప్రాంతాల నుంచి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాక పోవడంతో జాప్యం జరుగుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో కూడా ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు స్టీల్‌, సిమెంట్‌ ధరలు కూడా అమాంతంగా పెరిగి పోవడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావని చెబుతున్నారు.
పట్టుబట్టి సాధించిన..
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులకు పట్టుబట్టి నిధులు సాధించిన ప్రయోజనం కనిపించడం లేదు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కోట్లాడి మరి పరిపాలన అనుమతులు సాధించారు. అయిన పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. అప్పట్లో రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనుల విషయమై తన చైర్మన్‌ పదవికే రాజీనామా చేస్తానని సవాల్‌ విసరడంతో జిల్లాలో రాజకీయ దుమారమే లేపింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాల్లోనూ పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనుమతులు వచ్చి రెండు మాసాలు గడిచి పోతున్న పనులు మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. రైల్వేశాఖ పరిధిలోని పనులు మినహా ఇతర సివిల్‌ పనులను చేపట్టేందుకు ఆటంకాలే ఎదురవుతున్నాయి. కొంత వరకు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. పనులను ప్రారంభించేందుకు అనువైన సమయమైన టెండర్లు పూర్తికాక పోవడంతో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టెండర్లు పూర్తయితే పనులను ప్రారంభిస్తాం..
- నర్సయ్య (ఈఈ, ఆర్‌అండ్‌బీ ఆదిలాబాద్‌)


జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయితే పనులను ప్రారంభిస్తాం. ఇప్పటికే రెండు సార్లు టెండర్లను పిలిచిన ఎవరూ ముందుకు రాలేదు. శుక్రవారం నుంచి మరోసారి టెండర్లను ఆహ్వానిస్తున్నాం. స్థానికంగా అర్హత కలిగిన కాంట్రాక్టర్లు లేక పోవడమే ఇబ్బందికరంగా మారుతుంది. ఆన్‌లైన్‌ టెండర్లయిన ఇతర ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు వేసవి సీజన్‌ కావడంతో స్టీల్‌, సిమెంట్‌ ధరలు కూడా విఫరీతంగా పెరిగి పోవడం మరో కారణంగా మారుతోంది.  

Updated Date - 2022-04-22T05:08:23+05:30 IST