విద్యుదాఘాతంలో కౌలు రైతు మృతి

ABN , First Publish Date - 2022-08-09T04:44:55+05:30 IST

మండల కేంద్రంలోని దరియాపూర్‌కు చెందిన డాంగే నారాయణ (48) అనే కౌలు రైతు సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డాంగే నారాయణ స్థానిక దరియాపూర్‌ తండాశివారులో ఉన్న ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం పొలంలో కలుపు తీయడానికి కూలీలను పిలిపించాడు.

విద్యుదాఘాతంలో కౌలు రైతు మృతి

నవీపేట:  మండల కేంద్రంలోని దరియాపూర్‌కు చెందిన డాంగే నారాయణ (48) అనే కౌలు రైతు సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డాంగే నారాయణ స్థానిక దరియాపూర్‌ తండాశివారులో ఉన్న ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం పొలంలో కలుపు తీయడానికి కూలీలను పిలిపించాడు. బోరును బంద్‌ చేయడానికి నారాయణ స్టార్టర్‌ డబ్బా వద్దకు వెళ్లగా అతడికి షాక్‌ తగలడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే పొలంలో ఉన్న కూలీలు అతడిని చికిత్స నిమిత్తమై మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి తండ్రి హన్మాండ్లు, తల్లి గంగవ్వ, భార్య లావణ్య ఉన్నారు. నారాయణకు ఇద్దరు కుమార్తెలుండగా వారికి గతంలోనే వివాహాలు జరిగాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణ అకాల మృతి చెందడంతో దరియాపూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబం నిరుపేదకు చెందిన వారైనందున వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. 

Updated Date - 2022-08-09T04:44:55+05:30 IST