వెల్లివిరిసిన జాతీయ భావం

ABN , First Publish Date - 2022-08-13T06:11:39+05:30 IST

క్విట్‌ ఇండియా ఉద్యమంలో అశువులు బాసిన అమర వీరులకు పలువురు శుక్రవారం నివాళులర్పించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధు లు, మాజీ ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో రణరంగ చౌక్‌ ర్యాలీగా తర లి వచ్చారు.

వెల్లివిరిసిన జాతీయ భావం
రణరంగ్‌చౌక్‌లో అమరవీరులకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్‌, అధికారులు

క్విట్‌ ఇండియా ఉద్యమ వీరులకు రణరంగ్‌చౌక్‌లో ఘన నివాళి

తెనాలి అర్బన్‌, ఆగస్టు 12: క్విట్‌ ఇండియా ఉద్యమంలో అశువులు బాసిన అమర వీరులకు పలువురు  శుక్రవారం నివాళులర్పించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధు లు, మాజీ ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో రణరంగ చౌక్‌ ర్యాలీగా తర లి వచ్చారు. దీంతో ఈ ప్రాంగణం లో జాతీయ భావం వెల్లివిరిసింది. ఎమ్మె ల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అధికారులతో కలిసి గాంధీచౌక్‌ నుంచి కాలినడకన రణరంగ చౌక్‌ చేరుకున్నారు.  రణరంగ చౌక్‌ వద్ద అమర వీరులకు మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో తెనాలివాసులు పాల్గొనడం ఈ ప్రాం తానికి గర్వ కారణమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, సబ్‌ కలెక్టర్‌ నిధిమీనా, చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖలేదా నసీమ్‌, కమిషనర్‌ జస్వంతరావు, డీఎస్పీ స్రవంతిరాయ్‌ నివాళులర్పించారు. అనంతరం గిరి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 


టీడీపీ నేతల నివాళి

రణరంగ చౌక్‌లో అమరవీరులకు టీడీ పీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు నివాళులర్పించారు. టీడీపీ కార్యాలయం నుంచి రణరంగ చౌక్‌ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మాజీమంత్రి ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీస్తుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిమూడేళ్లు దాటినా అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. ఆనందబాబు మాట్లాడుతూ అనుభవం లేని అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.  


Updated Date - 2022-08-13T06:11:39+05:30 IST