తెనాలిలో కరోనా కిట్ల కొరత

ABN , First Publish Date - 2020-07-16T14:10:02+05:30 IST

తెనాలి జిల్లా వైద్యశాలలో కరోనా పరీక్షల కిట్లకు కొరత ఏర్పడింది. రెండు రోజులుగా..

తెనాలిలో కరోనా కిట్ల కొరత

తెనాలి(ఆంధ్రజ్యోతి): తెనాలి జిల్లా వైద్యశాలలో కరోనా పరీక్షల కిట్లకు కొరత ఏర్పడింది. రెండు రోజులుగా ఈ కిట్లు సరిపడా అందకపోవటంతో కరోనా అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు వైద్యశాలకు వస్తున్న బాధితులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం మాత్రం కేవలం 50 కిట్లు మాత్రమే గుంటూరు నుంచి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా కొవిడ్‌ పరీక్షలు జరిపే వైద్యశాలలకు గుంటూరు నుంచి కిట్లు సరఫరా చేయాలి. అయితే ఏ ఆసుపత్రి సిబ్బంది ఏరోజుకారోజూ గుంటూరు వెళ్లి వారికి కేటాయించిన కిట్లను తీసుకు రవాల్సి ఉండటంతో ఆయా వైద్యశాలల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా చికిత్స ఈ నెల 14 నుంచి తెనాలిలో ప్రారంభమైతే, మందులు ఇంతవరకు వైద్యశాలకు అందలేదు. రెండు రోజులుగా వైద్యశాలకు కేటాయించిన కిట్లతో అవకాశం ఉన్నవరకు పరీక్షలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సనత్‌కుమారి తెలిపారు.  

Updated Date - 2020-07-16T14:10:02+05:30 IST