కవిరాజు రచనలు నేటికీ సజీవం

ABN , First Publish Date - 2021-01-16T05:28:54+05:30 IST

వందేళ్ల క్రితం హేతువాదం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకు తెనాలి కేంద్రంగా బీజాలు వేసిన త్రిపురనేని రామస్వామి రచనలు నేటికీ సజీవంగా ఉన్నాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు

కవిరాజు రచనలు నేటికీ సజీవం
నివాళులు తెలుపుతున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, తదితరులు

 ఎమ్మెల్సీ డొక్కా మణిక్యవరప్రసాద్‌



 తెనాలిటౌన్‌, జనవరి 12: వందేళ్ల క్రితం హేతువాదం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకు తెనాలి కేంద్రంగా బీజాలు వేసిన త్రిపురనేని రామస్వామి రచనలు నేటికీ సజీవంగా ఉన్నాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. శుక్రవారం కవిరాజు పార్కులో సామాజిక, సాహితీ సంస్థ ఆధ్వర్యంలో రామస్వామి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ కంటే ముందే త్రిపురనేని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఇటీవల మరణించిన ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల దుర్గాప్రసాద్‌ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు, బొల్లిముంత కృష్ణ, గోగినేని కేశవరావు, కనపర్తి బాబూరావు, జె.ఎస్‌.ఆర్‌.కృష్ణయ్య, అలపర్తి వెంకటేశ్వరరావు, రత్నకుమారి, చెరుకుమల్లి సింగారావు, నిర్మలా రమేష్‌, కొండముది రమేష్‌, పందిటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:28:54+05:30 IST