ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన skater girl

ABN , First Publish Date - 2022-05-23T14:37:37+05:30 IST

ముంబైకి చెందిన పదేళ్ల స్కేటర్ బాలిక ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించింది...

ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన skater girl

ముంబై: ముంబైకి చెందిన పదేళ్ల స్కేటర్ బాలిక ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించింది.పదేళ్ల స్కేటర్ రిథమ్ మమానియా 11 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ పర్వతారోహకుల్లో ఒకరిగా అరుదైన ఘనత సాధించింది.బాలిక తల్లిదండ్రులు హర్షల్, ఉర్మిలు ట్రెక్కింగ్ సమయంలో ఆమెతో పాటు ఉన్నారు.బాంద్రా సబర్బన్‌లోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న రిథమ్ మే 6న మధ్యాహ్నం ఒంటిగంటకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుందని ఆమె తల్లి ఉర్మి చెప్పారు.బేస్ క్యాంప్ 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ యాత్రను పూర్తి చేయడానికి బాలికకు 11 రోజులు పట్టిందని తల్లి చెప్పారు.‘‘స్కేటింగ్‌తో పాటు, ట్రెక్కింగ్ నా అభిరుచి, కానీ ఈ ట్రెకింగ్ నాకు పర్వతాలపై వ్యర్థాల నిర్వహణ సమస్య పరిష్కరించడం ఎంత ముఖ్యమో నాకు నేర్పింది’’ అని బాలిక రిథమ్ చెప్పింది.


రిథమ్‌కు ఐదేళ్ల వయస్సు నుంచి స్కేలింగ్ అంటే చాలా ఇష్టం. రిథమ్ 21-కిలోమీటర్ల దూద్‌సాగర్, మహులి, సోండై, కర్నాలా, లోహగడ్ వంటి సహ్యాద్రి శ్రేణులలో కొన్ని శిఖరాలను అధిరోహించిందని ఆమె తల్లి చెప్పారు.బేస్ క్యాంప్ ట్రెకింగ్ సమయంలో రిథమ్ వివిధ వాతావరణ పరిస్థితులలో 8-9 గంటల పాటు నిటారుగా ఉండే ప్రాంతాల్లో నడిచిందని ఉర్మి చెప్పారు. ‘‘కచ్ ట్రెక్కర్‌ల బృందంతో పాటు నేపాల్‌కు చెందిన 'సటోరి అడ్వెంచర్స్' అనే సంస్థతో కలిసి రిథమ్  బేస్ క్యాంప్‌కు వెళ్లింది.బేస్ క్యాంప్‌కు చేరుకున్న తర్వాత, సమూహంలోని ఇతర సభ్యులు హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు, కానీ రిథమ్ మాత్రం కిందికి నడవాలని పట్టుబట్టింది. అందుకే మేము నలుగురం దిగాలని నిర్ణయించుకున్నాం’’ అని ఉర్మి చెప్పారు.


Updated Date - 2022-05-23T14:37:37+05:30 IST