రేపటి నుంచి ‘పది’ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-22T05:37:30+05:30 IST

పదోతరగతి వార్షిక పరీక్షలు 23వ తేదీన ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జూన్‌ ఒకటో తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాలను సంబంధిత పోలీ్‌సస్టేషన్లకు విద్యాశాఖ అధికారులు తరలించారు. జిల్లాలో సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమీలేవు.

రేపటి నుంచి ‘పది’ పరీక్షలు

జూన్‌ 1 వరకు  కొనసాగనున్న పరీక్షలు

పోలీ్‌సస్టేషన్లకు ప్రశ్నపత్రాలు తరలించిన యంత్రాంగం

9,488 మంది విద్యార్థులు, 60 పరీక్షా కేంద్రాలు 

పకడ్బందీగా ఏర్పాట్లు : డీఈవో కె.నర్సింహ


యాదాద్రి, మే21(ఆంధ్రజ్యోతి): పదోతరగతి వార్షిక పరీక్షలు 23వ తేదీన ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జూన్‌ ఒకటో తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాలను సంబంధిత పోలీ్‌సస్టేషన్లకు విద్యాశాఖ అధికారులు తరలించారు. జిల్లాలో సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమీలేవు. జిల్లావ్యాప్తంగా 9,488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30నుంచి 12.15గంటలవరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8.30లోగా చేరుకోవాలి. ఉదయం 9.35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలో మొత్తం 60 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 60 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 10 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు కస్టోడియన్‌, జాయింట్‌ కస్టోడియన్లను, రూట్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, వైద్యం, విద్యుత్‌ సదుపాయాలు అవసరమైన ఫర్నీచర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పరీక్షకేంద్రం వద్ద మెడికల్‌కిట్‌తో పాటు ఒక ఏఎన్‌ఎంను, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా డీఈవో కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేశారు. ఏదైనా సందేహాలు ఉన్న ఉంటే ఫోన్‌ నంబర్‌ 08685293422లో సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలు జరిగే సమయంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు   : కె.నర్సింహ, డీఈవో 

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాల వద్ద తాగునీరు వంటిమౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. హాల్‌టికెట్లు తీసుకున్న విద్యార్థులు ఒకరోజు ముందే ఆయా కేంద్రాల వివరాలు తెలుసుకుంటే మంచిది. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దు. పరీక్షా కేంద్రాల రూట్‌లో నడిచే సర్వీసులను విద్యార్థులను పరీక్షలకు వెళ్లివచ్చే సమయాల్లో నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.                  

Updated Date - 2022-05-22T05:37:30+05:30 IST