నేటి నుంచి ‘పది’ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-23T06:04:05+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు.

నేటి నుంచి ‘పది’ పరీక్షలు
‘ఖని’లోని ప్రభుత్వ హైస్కూల్‌లో నంబర్లు వేస్తున్న ఉపాధ్యాయులు

- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

పెద్దపల్లి కల్చరల్‌, మే 22 : జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.45 నిమిషాల వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 8136 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు నిర్వహించేందుకు 49 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీరు అందుబాటు లో ఉంచుతున్నారు. వేసవి దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సి బ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పారిశుధ్యం పక డ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 10వ తరగతి ప్రశ్న పత్రాలు జిల్లాలోని 14 పోలీస్‌ స్టేషన్‌లలో భద్రపరచి పరీక్ష కేంద్రాలకు పోలీస్‌ బందోబస్తుతో ప్రశ్నపత్రాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ టీవీ కెమెరా ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు.విద్యార్థులు తమ హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోని ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్ష కేంద్రం సూపరిండెంట్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద జిల్లా విద్యాశాఖ అధికారి,మండల విద్యాశాఖ అధికారుల ఫోన్‌ నెంబర్‌లు అందుబాటులో ఇస్తామని అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలకు ఎ లాంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ అనుమతించబోమని, విద్యార్థులు తమ వెం ట సెల్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ తీసుకురావద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ఆయా పరీక్ష కేంద్రాలను అరగంట ముందే చేరుకోవాలని ఐదు నిమిషా లు అనంతరం విద్యార్థులను ఎవరిని అనుమతించవద్దని ఈ విషయం లో అందరూ ఛీప్‌సూపరింటెండెంట్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. 49మంది ఛీప్‌ సూపరింటెండెంట్లు డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఫ్లయిం గ్‌ స్వ్కాడ్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఇన్విజిలేటర్లను సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2022-05-23T06:04:05+05:30 IST