పది పరీక్షలు ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2020-06-01T09:51:14+05:30 IST

2020 మార్చిలో జరగవలసిన పదో తరగతి వార్షిక పరీక్షలు కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తా త్కాలికంగా వాయిదా

పది పరీక్షలు ప్రశ్నార్థకం

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుతో కలకలం 

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

పరీక్ష కేంద్రాల పెంపుతో ఇబ్బందులు ఎదుర్కోనున్న విద్యార్థులు

పరీక్షల నిర్వహణ వద్దంటున్న ఉపాధ్యాయ సంఘాలు


నిజామాబాద్‌ అర్బన్‌, మే 31: 2020 మార్చిలో జరగవలసిన పదో తరగతి వార్షిక పరీక్షలు కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తా త్కాలికంగా వాయిదా పడి.. ప్రస్తుతం జూన్‌ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పరీక్షల నిర్వహ ణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం, జిల్లాలో శనివారం కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 19 నుంచి 21 వరకు తెలుగు, హిం దీ పరీక్షలు నిర్వహించగా, మిగిలిన పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడడంతో హైకోర్టు ఆదేశా ల మేరకు మిగిలిన పరీక్షలను జూన్‌ 8 నుంచి జూలై 5 వర కు నిర్వహించాలని సూచించడంతో అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నారు.


జిల్లాలో ఇదివరకు 138 పరీక్ష కేంద్రాలు ఉండ గా హైకోర్టు సూచనల మేరకు విద్యార్థుల మధ్య భౌతిక దూ రం ఉండాలన్న ఆదేశంతో పరీక్షల కేంద్రాలను పెంచారు. అ దనంగా 109 పరీక్ష కేంద్రాలను పెంచగా 247 పరీక్ష కేంద్రాలలో 23,920 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు నెల రోజుల పాటు పరీక్షల నిర్వహ ణ కష్టసాధ్యమని కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయ సంఘాలు అనాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన వేతనాలను ప్రభుత్వం 50 శాతంకు తగ్గించడంతో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రస్తుత సమయంలో పరీక్షల విధులకు ఎంతవరకు హాజరవుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది.   


హాస్టల్‌ విద్యార్థులకు కష్టాలు.. 

సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండగా ప్రైవేట్‌ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మా త్రం పరీక్షలు రాయడం ఇబ్బందికరంగా ఉంది. జిల్లా కేం ద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటుండగా నెల రోజుల పాటు వారిని హాస్టళ్లలో ఉంచి వారికి వసతి కల్పించడం ప్రైవేట్‌ పాఠశాలలకు కొం త ఇబ్బందికరంగా ఉంది. ప్రైవేట్‌ పాఠశాలల హాస్టల్‌ భవనాలు ప్రస్తుతం పరీక్ష కేంద్రాలను పెంచిన నేపథ్యంలో అవి పరీక్ష కేంద్రాలుగా మారడంతో వాటిలో విద్యార్థులకు వసతి ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఇతర జిల్లా ల నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు రాయడం నెల రోజుల పాటు వారిని ఇతర ప్రాం తాల్లో ఉంచడం కొంత ఇబ్బందికరంగానే ఉం ది. ప్రైవేట్‌ పాఠశాల ల యాజమాన్యా లు విద్యార్థుల ను నెల రోజు ల పాటు వ సతి కల్పించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా తమ పాఠశాల మొత్తం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం తమ పాఠశాలలో అడ్మిషన్‌ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వస్తే తప్ప హాస్టళ్లలో విద్యార్థులను ఉంచుకోమని వా రు కరాఖండిగా చెబుతున్నారు. 


నెల రోజుల పాటు పరీక్షలతో ఇబ్బందులు..

విద్యాశాఖ ప్రకటించిన రీ షెడ్యూల్‌లో పరీక్షల నిర్వహణ నెల రోజుల పాటు ఉండడంతో విధులు నిర్వహి ంచే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల పా టు పరీక్షలు నిర్వహించడం, ప్రతీరోజు పరీక్ష కేంద్రా ల్లో శానిటైజేషన్‌ చేయడం, విద్యార్థులు భౌతిక దూరం పాటించడం కష్టసాధ్యమని వారంటున్నారు.


కేంద్రా ల్లో భౌతికదూరం పాటించినప్పటికీ కేంద్రాల బయట విద్యార్థుల తల్లిదండ్రులు వందల సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందని దీంతో కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండడం కూడా ఇబ్బందిని కలిగించే అంశమని, హాస్టళ్లలో భౌతిక దూరం, శానిటైజేషన్‌ సాధ్యం కాదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ప రీక్షకు, పరీక్షకు మధ్య రెండు రోజుల గ్యాప్‌ ఉండడం, జూన్‌ మొదటివారంలో, జూలైలో అకాలవర్షాలు పడే అవకాశం ఉందని ఈ సమయంలో పరీక్షల నిర్వహణ కష్టమని విద్యా ర్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-06-01T09:51:14+05:30 IST