కొవిడ్ టీకాలు వేయించుకుంటే liquorపై 10 శాతం రాయితీ

ABN , First Publish Date - 2021-11-24T13:09:54+05:30 IST

మందుబాబులకు శుభవార్త. మందుబాబులు కొవిడ్ రెండు డోసుల టీకాలు వేయించుకుంటే...

కొవిడ్ టీకాలు వేయించుకుంటే liquorపై 10 శాతం రాయితీ

భోపాల్: మందుబాబులకు శుభవార్త. మందుబాబులు కొవిడ్ రెండు డోసుల టీకాలు వేయించుకుంటే, వారికి మద్యం కొనుగోలుపై 10 శాతం రాయితీ ఇస్తామని  మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక పట్టణంలో ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. అధికారులు కొవిడ్-19కి వ్యతిరేకంగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న వారికి దేశీయ మద్యంపై 10 శాతం తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మందసౌర్ జిల్లా ఎక్సైజ్ శాఖ తెలిపింది.కొవిడ్-19 వ్యాక్సిన్‌ని రెండు డోస్‌లు తీసుకున్నట్లు రుజువు సర్టిఫికేట్ రూపంలో అందించే ఎవరికైనా మద్యం కొనుగోలుపై 10 శాతం తగ్గింపు అందిస్తామని మందసౌర్ జిల్లా ఎక్సైజ్ అధికారి అనిల్ సచన్ తెలిపారు.డిస్కౌంటు నిర్ణయంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ పెరిగింది.


 సీతామౌ ఫాటక్, భునియాఖేడి, పాత బస్టాండ్‌లోని మద్యం దుకాణాల్లో ఈ తగ్గింపు వర్తిస్తుంది.ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని సచన్ తెలిపారు.అయితే ఈ చర్య ప్రజలను మద్యం తాగేలా ప్రోత్సహిస్తుందని అధికార భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చాయి.దీంతో బీజేపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ‘‘ఈ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, మద్యం తాగేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది’’ అని మందసౌర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ సిసోడియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2021-11-24T13:09:54+05:30 IST