రెండు వేర్వేరు దొంగతనాల కేసుల్లో పది మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-09-29T04:52:30+05:30 IST

జిల్లాలో ని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని తొండూరు పోలీసు లు అరెస్టు చేసి వారి నుంచి 266 గ్రా ముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

రెండు వేర్వేరు దొంగతనాల కేసుల్లో పది మంది అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

266 గ్రాముల వెండి, రూ.9లక్షలు విలువైన బంగారు నగలు స్వాధీనం
కడప (క్రైం), సెప్టెంబరు 28:
జిల్లాలో ని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని తొండూరు పోలీసు లు అరెస్టు చేసి వారి నుంచి 266 గ్రా ముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు, కల్లమల పోలీసుస్టేషన్ల పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని కల్లమల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీ సు కార్యాలయం ఆవరణలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏఎస్పీ (అడ్మిన్‌) తుషార్‌ బేడి, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, పులివెందుల రూరల్‌ సీఐ బాలమద్దిలేటి, ముద్దనూరు సీఐ మోహన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బురాజన్‌ వివరాలు వెల్లడించారు.
తొండూరు పరిధిలో....
కలమల్ల పరిధి తొండూరు మండలం పాలమూరు, కలమల్ల, ముద్దనూరు ప్రాంతాల్లోని దేవాలయాల్లో టార్గెట్‌ చేసుకుని రాత్రుళ్లు గుడి తలుపులు పగులగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి నగలు అపహరిస్తుంటారు. ఈ క్రమంలో తొండూరులో గుడి పగలగొట్టి హుండీలోని డబ్బు, వెండి వస్తువులతో పరారవుతున్నట్లు సమాచారం రావడంతో నిందితులైన నల్లపోతుల శంకరయ్య,  రాజీ అంకాల్‌, రాజీ పెద్దన్న, మరో బాలున్ని అరెస్టు చేసి వారి నుంచి 266 గ్రాములు వెండి ఆభరణాలు, ఆంప్లిఫయర్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో హుండీలు పగుల గొడుతున్న దొంగలను అరెస్టు చేయడంలో పులివెందుల రూర ల్‌ సీఐ, తొండూరు ఎస్‌ఐ హనుమంతు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ముద్దనూరు పరిధిలో....
కలమల్ల పరిధిలో సీతరాంపల్లె మునీంద్ర కుమార్తె ఇంటి ముందు ఉండగా ఇద్దరు ద్విచక్ర వాహనం లో వచ్చి బలవంతంగా ఆమె చేతిలోని మూడు బంగారు గాజులు, మెడలోని బంగారు గొలుసు మొత్తం 8.7 తులాల బంగారు గొలుసు లు లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా ఉంచామన్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ముద్దనూరు కలమల్ల సీఐలు మోహన్‌రెడ్డి, శివ ప్రసాద్‌, ఎస్‌ఐలు పి.చంద్రమోహన్‌ సిబ్బందితో నిఘా ఉంచి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు ఇటీవల ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లోనూ దొంగతనం చేశారు.
అరెస్టయిన నిందితులు వీరే..
ముద్దనూరు మండలం సాయినగర్‌ కాలనీ వాసి రాయపాటి బాబు, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం టౌన్‌, బీజేపీకాలనీకి చెందిన కలమంది చంద్ర, అదే కాలనీకి చెందిన తిరుచానూరు అమర్‌నాధ్‌, ముద్దనూరు మండలం మంగపట్నం, కోసినేపల్లె వాసులు బి.రామాంజనేయులు, చింతా ముర ళి, ముద్దనూరు టౌన్‌ ఎస్‌ఈ గిరి కాలనీకి చెందిన అయ్యన్నగారి పవన్‌కళ్యాణ్‌ ఆలియాస్‌ వినోద్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.9లక్షలు విలువై న బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. చోరీ కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీ సు సిబ్బందిని ఎస్పీ, ఏఎస్పీలు అభినందించారు.

Updated Date - 2022-09-29T04:52:30+05:30 IST