కొనసాగుతున్న పది పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-26T05:10:40+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు బుధవారం కొనసాగాయి.

కొనసాగుతున్న పది పరీక్షలు
బాదేపల్లి : పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులను తనిఖీ చేస్తున్న ఉపాధ్యాయులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 25 : జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు బుధవారం కొనసాగాయి. పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందులాల్‌ పవర్‌, డీఈవో ఉషారాణి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షలకు 98.61 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పది పరీక్షలకు 13,275 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,090 మంది హాజరు కాగా 185 మంది హాజరు కాలేదు. మొత్తంగా పది పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా సాగాయి.

బాదేపల్లిలో... 

బాదేపల్లి : జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలో 7 కేంద్రాలు, మండలంలోని కోడ్గల్‌ జడ్పీఉన్నత పాఠశాలల్లో కేం ద్రాల్లో మొత్త 1860 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 20 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎంఈఓ కె. మంజులాదేవి తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేం ద్రాలకు చేరుకొని పరిక్ష సమయం కోసం ఎదురు చూస్తూ కూ ర్చోవడం కనిపించింది. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధించడంతో సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేశారు. 

బాలానగర్‌లో 14మంది గైర్హాజరు

బాలానగర్‌ : మండల కేంద్రలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లో మొత్త 739 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 14 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు.

Updated Date - 2022-05-26T05:10:40+05:30 IST