ఈ సారి పది లక్షల మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-07-03T04:52:25+05:30 IST

ఈ సంవత్సరం హరితహారం కా ర్యక్రమంలో భాగంగా ఇరిగేషన్‌, దేవాదాయశాఖ భూముల్లో కనీసం 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు.

ఈ సారి పది లక్షల మొక్కలు నాటాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావు


  • - ఇరిగేషన్‌, దేవాదాయ భూముల్లో నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలి : కలెక్టర్‌ వెంకట్రావు
  • - హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 2 : ఈ సంవత్సరం హరితహారం కా ర్యక్రమంలో భాగంగా ఇరిగేషన్‌, దేవాదాయశాఖ భూముల్లో కనీసం 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు. ఈ విషయమై శనివారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించిన భూముల్లో కనీసం 5 లక్షల మొ క్కలు నాటాలని, అదేవిధంగా మరో 5 లక్షలు దేవాదాయ శాఖ భూముల్లో నాటాలని, ఇందుకు సంబంధించి ఇరిగేషన్‌, అటవీ, డీఆర్‌డీవోలు ఉమ్మడిగా తనిఖీ నిర్వహించి భూములను, స్థలాలను గుర్తించాలని సూచించా రు. ఈ ప్రక్రియ ఈ నెల 5, 6వ తేదీలలో పూర్తి చేయాలని ఆదేశించారు. లీజుకు తీసు కున్న రైతుల భుముల్లో కూడా మొక్కలు నాటాలన్నారు. పొలంగట్లు, చెరువు గట్లపై టేకు, బొప్పాయి మొక్కలు నాటాలని సూచించారు. కాగా జిల్లాలో నీటి పారుదల శాఖ పరిధిలోకి వచ్చే భూముల్లో 110 సైట్‌లను గుర్తించారని, ము ఖ్యంగా కరివెన, ఉద్దండాపూర్‌ లాంటి రిజర్వాయర్లతో పాటు, అన్ని చెరువులు, చెరువు కట్టలు, గట్లు, అన్నింటిలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ వెల్ల డించారు. ప్రతీ చెరువుకు ఇరిగేషన్‌ శాఖ నుంచి, డీఆర్డీవో తరపున ఒకరి చొప్పున ఇన్‌చార్జీగా నియమించి ప్రతీ రోజు సమీక్షించాలని తెలిపారు. దేవాలయాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు వారి పరిధిలోని అన్ని దేవాలయాలు తిరిగి సంబంధిత దేవాలయాల పూజారులతో ఈ సోమవారం సమావేశం నిర్వహించి హరితహారం కింద చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమంపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డిఎఫ్‌ఓ గంగారెడ్డి, డిఆర్డీఓ యాదయ్య, ఇరిగేషన్‌ ఇంజనీర్లు, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:52:25+05:30 IST