పది మంది కోడిపందెం రాయుళ్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T04:52:36+05:30 IST

రెండు వేర్వేరు మండలాల్లో నిర్వహించిన దాడుల్లో పదిమంది కోడి పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పది మంది కోడిపందెం రాయుళ్లు అరెస్టు

నందలూరు, జనవరి15: రెండు వేర్వేరు మండలాల్లో నిర్వహించిన దాడుల్లో పదిమంది కోడి పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీ కుమ్మరపల్లె పంట పొలా ల్లో కోడి పందెం స్థావరాలపై ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.

ఈ దాడుల్లో ఏడుగురు కోడిపందెం రాయుళ్లు, మూడు కోళ్లు, రూ. 5200లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎ్‌స ఐ సుబ్బరాయుడు, హెడ్‌కానిస్టేబుల్‌ రహీంబాబు, పోలీసులు పాల్గొన్నారు.

సిద్దవటంలో.....

సిద్దవటం, జనవరి15: సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో శుక్రవారం కోడిపందెం నిర్వహిస్తున్న ముగ్గురు కోడిపందెం రాయళ్లను అరెస్టు చేసి వారి నుంచి రెండు కోడి పుంజులు, 515రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలియజేశా రు. కోడిపందేలు నిర్వహకులపై ఆరా తీస్తున్నామని దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 

ఏడుగురు జూదరుల అరెస్టు

బ్రహ్మంగారిమఠం, జనవరి 15: సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో కంపచెట్ల పొదల్లో ఏడుగురు జూదం ఆడుతూ పట్టుబడినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.16,500 డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-16T04:52:36+05:30 IST