Canada: కెనడాలో దారుణం.. దుండగుల దాడిలో 10 మంది మృతి

ABN , First Publish Date - 2022-09-05T14:36:55+05:30 IST

కెనడాలో దారుణం చోటు చేసుకుంది. సాస్కట్చేవాన్(Saskatchewan) ప్రావిన్స్‌లో దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా.. సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో కెనడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించా

Canada: కెనడాలో దారుణం.. దుండగుల దాడిలో 10 మంది మృతి

ఎన్నారై డెస్క్: కెనడాలో దారుణం చోటు చేసుకుంది. సాస్కట్చేవాన్(Saskatchewan) ప్రావిన్స్‌లో దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా.. సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో కెనడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అంతేకాకుండా ఇద్దరు అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. 


ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనుమానితులను డామియన్ శాండర్సన్, మైల్స్ శాండర్సన్‌గా గుర్తించారు. కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేసి దుండగులు 13చోట్ల ఈ డాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంత మందిని  యాధృచికంగా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొదటి కాల్‌ ఉదయం 5.40 గంటలకు వచ్చినట్టు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ భయంకరమైన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-05T14:36:55+05:30 IST