‘పది’ తొలి పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-05-24T05:08:22+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా

‘పది’ తొలి పరీక్ష ప్రశాంతం
షాబాద్‌లోని పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీ చేస్తున్న అధికారులు

  • జిల్లాలో మొదటిరోజు 99.03శాతం మంది విద్యార్థుల హాజరు

రంగారెడ్డి అర్బన్‌, మే23 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు కొనసాగిన టెన్త్‌ పరీక్షలకు 47,516 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,057 మంది విద్యార్థులు హాజరయ్యారు. 459 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే తొమ్మిది మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షకు రావాల్సి ఉండగా ఐదుగురు హాజరయ్యారు. నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పర్యవేక్షించారు. జిల్లాలోని 31 పోలీస్టేషన్లలో భద్రపర్చిన పదో తరగతి ప్రశ్న పత్రాలను పటిష్ఠ బందోబసు మధ్య తీసుకెళ్లారు.  పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ విధించారు. కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, క్యాలుక్యూలేటర్‌ వంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌లను అనుమతించలేదు. చూచిరాతలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రాల్లోకి అనుమతించారు. 



Updated Date - 2022-05-24T05:08:22+05:30 IST