మెక్సికోలో Hurricane...10మంది మృతి

ABN , First Publish Date - 2022-06-01T17:16:13+05:30 IST

మెక్సికో దేశంలో తుపాన్(హరికేన్) వల్ల కురిసిన భారీవర్షాలతో 10మంది మరణించారు....

మెక్సికోలో Hurricane...10మంది మృతి

మరో 20 మంది గల్లంతు

అక్సాకా(మెక్సికో): మెక్సికో దేశంలో తుపాన్(హరికేన్) వల్ల కురిసిన భారీవర్షాలతో 10మంది మరణించారు. భారీవర్షాల వల్ల వరదలు సంభవించడంతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మరణించగా, మరో 20 మంది తప్పిపోయారని మెక్సికో అధికారులు చెప్పారు. ఈ తుపాన్ ప్రభావం వల్ల వెరాక్రూజ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. తప్పిపోయిన 20 మంది కోసం గాలిస్తున్నామని ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ అలెజాండ్రో మురాత్ చెప్పారు. భారీవర్షాల వల్ల నదులు పొంగి ప్రవహించాయి.శాంటా కాటరినా క్సానాగుయా కమ్యూనిటీలో కొండ భాగం కూలిపోవడంతో 18-21 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు మరణించారని ఓక్సాకా పౌర రక్షణ కార్యాలయం తెలిపింది.లానో డెల్ చిల్లర్‌లో కొండచరియలు విరిగిపడటంతో మరో మహిళ మరణించగా, ఆమె కుమారుడు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.హరికేన్ వల్ల గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 

Updated Date - 2022-06-01T17:16:13+05:30 IST