14 ప్రాంతాల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్లు

ABN , First Publish Date - 2020-03-26T06:39:18+05:30 IST

కరోనా నేపథ్యంలో కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులుగా సంచరించకుండా అధికారలు ఆంక్షలు జారీ చేశారు.

14 ప్రాంతాల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్లు

నగరంలో 8 మొబైల్‌ కూరగాయల వాహనాలు


గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 25: కరోనా నేపథ్యంలో కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులుగా సంచరించకుండా అధికారలు ఆంక్షలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్ల కొనుగోళ్లకు తాత్కాలిక మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఆయా మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలను బుధవారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ, కమిషనర్‌ అనురాధతో కలిసి పరిశీలించారు. మార్కెట్ల వివరాలు ప్రజలకు తెలిసేలా మైక్‌ ప్రచారం, బ్యానర్లను ప్రదర్శించాలని కలెక్టర్‌ తెలిపారు. కొనుగోళ్లకు వచ్చే ప్రజలు కుటుంబానికి ఒక్కరే రావాలని, వారు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. నగరంలో 14 ప్రాంతాలలో తాత్కాలిక మార్కెట్లను, 8 మొబైల్‌ కూరగాయల వాహనాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే ఆయా దుకాణాలు నిర్వహిస్తామన్నారు.


నగరంలో బీఆర్‌ స్టేడియం, ఏసీ కళాశాల ఎదుట ఉల్ఫ్‌ గ్రౌండ్‌, లాడ్జి సెంటర్‌లోని ఎల్‌ఈఎం స్కూల్‌, గుంట గ్రౌండ్‌, గార్డెన్స్‌లోని సీతారామయ్య హైస్కూల్‌, ఏటి ఆగ్రహారంలోని మున్సిపల్‌ స్కూల్‌, రింగ్‌ రోడ్డులోని డాన్‌బాస్కో గ్రౌండ్‌, నగరంపాలెంలోని స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌, అరండల్‌పేట పిచుకులగుంట, నల్లకుంటలోని రెడ్డికాలేజి, ఎస్‌వీఎన్‌ కాలనీలోని చిన్మయ స్కూల్‌, అమరావతి రోడ్డులోని మెడికల్‌ కాలేజి బాయ్స్‌ హాస్టల్‌, పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కాలేజిలలో తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి రోజు సాయంత్రం 4  నుంచి 6 గంటల వరకు ఎస్‌వీఎన్‌ కాలనీ, గుజ్జనగుండ్ల, గోరంట్ల, రైలుపేట, బాలాజీనగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ, సిద్ధార్థనగర్‌, కొరిటెపాడు ప్రాంతాలలో మొబైల్‌ వాహనాలు సంచరిస్తాయన్నారు. 

 

ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికి సరుకులు

కావాల్సిన సరుకులు వాట్సాప్‌ చేస్తే చాలు

నగరంలో ఆన్‌లైన్‌ ద్వారా కిరణా సరుకులు ఇంటింటికి సరఫరా చేసేందుకు నాలుగు సూపర్‌ బజార్లు ముందుకు వచ్చాయి. ఆయా సూపర్‌బజార్లను వాట్సాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదిస్తే డోర్‌ డెలివరీకి సరుకులు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. విజయదుర్గా సూపర్‌ మార్కెట్‌  వాట్సాప్‌ 9494164615, మంగళదాస్‌నగర్‌లోని రిలయన్స్‌ మార్కెట్‌ వాట్సాప్‌ 6301853027, బృందావన్‌ గార్డెన్స్‌ స్పెన్సర్‌ రిటైల్‌ ఫోన్‌ 7596075492, వాట్సాప్‌ నెంబర్‌ 7702203929, రిలయన్స్‌ మార్కెట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా జ్ట్టిఞట://ఠీఠీఠీ.ట్ఛజూజ్చీుఽఛ్ఛిటఝ్చట్ట.జీుఽ/ సంప్రదిస్తే కావాల్సిన సరుకులను ఇంటికి తెచ్చి ఇచ్చేందుకు నిర్వాహకులు ముందుకు వచ్చారు. 

Updated Date - 2020-03-26T06:39:18+05:30 IST