Abn logo
Mar 27 2020 @ 00:30AM

ప్రజలకు అందుబాటులో తాత్కాలిక రైతు బజారు

కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి 


నాయుడుపేట, మార్చి 26 : నిత్యవసర సరుకులైన కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనల మేరకు తాత్కాలిక రైతు బజారును ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం తెలిపారు. పెసల జయబాబు ప్రాంగణం, ఏఎల్‌సీఎం పాఠశాల క్రీడా ప్రాంగణం, మార్కెట్‌లో తాత్కాలిక రైతు బజారును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరిన్ని తాత్కాలిక రైతు బజారును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలోని షాపింగ్‌మాల్స్‌ నుంచి నిత్యవసర సరుకులను ఇంటి వద్దకే డోర్‌ డెలివరి చేసేందుకు ప్రత్యేకంగా 10 వాహనాలను ఏర్పాటు చేశామని కమిషనర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement