Abn logo
Aug 1 2021 @ 07:33AM

ఆలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు

                     - మంత్రి పీకే శేఖర్‌ బాబు


ప్యారీస్‌(చెన్నై): కరోనా నిబంధనలను పాటించి ఆలయాలకు వెళ్లే భక్తులకు మరిన్ని వసతులు కల్పించనున్నట్టు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. స్థానిక విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవి బాలియమ్మన్‌ ఆలయం, సౌమ్య దామోదర పెరుమాళ్‌ ఆలయం, అగస్తీశ్వర స్వామి ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి శేఖర్‌బాబు శనివారం నేరుగా వెళ్లి పరిశీలించారు. దేవి బాలియమ్మన్‌ ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఆగమశాస్త్ర ప్రకారం సన్నిధులను మార్పుచేయాలని ఆలయ అధికారులకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, సౌమ్య దామోదర పెరుమాళ్‌ ఆలయ ప్రవేశద్వారంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని, తీర్థకొలను, రథానికి మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.