Abn logo
May 10 2021 @ 23:40PM

ఆలయాల్లో ఇక ఏకాంత సేవలే

 భక్తులకు పూజలు, ప్రవేశాలు లేవు


నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) మే 10 : జిల్లాలోని ఆలయాల్లో ఇకపై ఏకాంత సేవలే జరుగుతాయని, భక్తులకు పూజలు, ప్రవేశాలు ఉండవని నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య, జిల్లా పురోహిత సంఘం, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి, ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తెలిపాయి. ఈ మేరకు సోమవారం  జిల్లా అర్చక సమాఖ్య నేతలు ప్రసాద్‌ ఆచార్యులు, శేషాచార్యులు, ఫణికుమార్‌, శ్రీనివాసశర్మ, పురోహిత సంఘం నేతలు పారా శ్రీధర్‌ శర్మ, బ్రాహ్మణసేవా సంఘాల అధ్యక్షులు వాసుదేవరావు, కామేశ్వరి ప్రసాద్‌, ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నేతలు రామసుబ్రహ్మణ్య శర్మ, మణిశంకర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.  జిల్లాలో కరోనాతో అర్చకులు, పురోహితులు మృతిచెందుతున్నారని  వారు ఆందోళన వ్యక్తం చేశారు.  6ఏ, 6 బీ, సీ అర్చకులందరూ ఒక నెల పాటు స్వామికి ఏకాంతంగా నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ధర్మకర్తలు, ఈవోలు చెప్పినా భక్తులకు దర్శనాలు లేకుండా, తీర్థం, శఠారి ఇవ్వకుండా నమస్కారం చేసుకొని వెళ్లాలని చెప్పాలని సూచించారు. పురోహితులు కూడా పెళ్లిళ్లు, వ్రతాలు, గృహ ప్రవేశాలను రద్దు చేసుకోవాలని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement