Advertisement
Advertisement
Abn logo
Advertisement

శివనామస్మరణలతో మారుమోగిన ఆలయాలు

ముండ్లమూరు, డిసెంబరు 4 : కార్తీక మాసం చివరి రోజు కావటంతో శనివారం మండలంలోని పలు శివాయాలు భక్తులతో మారు మ్రోగి పోయాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు తలంటు స్నానాలు చేసి తడిచి దుస్తులతో దేవాలయాలకు వెళ్ళి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం దేవతా మూర్తులను తమ పిల్లా పాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. మండలంలోని పులిపాడులోని శ్రీ గంగా పార్వతి సమేత పూర్ణేశ్వర శివాలయంలో పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. పూర్ణేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. పార్వతీదేవితో పాటు వినాయకుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, ధ్వజ స్తంభంకు భక్తులకు పూజలు నిర్వహించారు. ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు పోటెత్తింది. భక్తులకు పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సంగీత కచేరి నిర్వహించారు. రాత్రుల సమయాల్లో జాగారం నిర్వహించారు. విద్యుత్‌ దీపాలంకరణలతో ఆలయాలను తీర్చిదిద్దారు. శివాలయానికి దర్శి, పులిపాడు, ఉల్లగల్లు, కెల్లంపల్లి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోని ఈదర, మారెళ్ళ, పోలవరం, పసుపుగల్లు, పెద ఉల్లగల్లు తదితర గ్రామాల్లో శివాలయాలు కార్తీక ఆఖరి రోజుకావటంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పూట ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు చేశారు.

Advertisement
Advertisement