Abn logo
Sep 21 2021 @ 09:40AM

ఆలయాల్లో అరిటాకుల్లో అన్నదానం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో అన్నదానం చేస్తున్న అన్ని ఆలయాల్లో సోమవారం నుంచి అరిటాకుల్లో భోజనం వడ్డించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ఆలయాల్లో అరిటాకుల్లో భోజనం తాత్కాలికంగా నిలిపివేశారు. సోమవారం నుంచి అన్ని ఆలయాల్లో అన్నదానం కార్యక్రమంలో అరిటాకుల వినియోగం ప్రారంభమైంది. సోమవారం నుంచి గురువారం వరకు ఆలయాల్లో అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పొట్లాల్లో ఆహారం అందిస్తారని ప్రభుత్వం తెలియజేసింది.