ఆలయాలు కిటకిట

ABN , First Publish Date - 2022-08-14T05:14:10+05:30 IST

శ్రావణమాసం మూడో శనివారం కావడంతో పలు ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి.

ఆలయాలు కిటకిట
కదిరి ఆలయంలో భక్తుల సందడి

కదిరిఅర్బన, ఆగస్టు 13:  శ్రావణమాసం మూడో శనివారం కావడంతో పలు ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీమత ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.  మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


  పాలపాటిదిన్నె ఆలయంలో...

నల్లచెరువు :  పాలపాటిదిన్నె ఆలయం శ్రావణమాసం మూడవ శనివారం భక్తులతో కిటకటలాడింది. ఆలయ ఈఓ మోహనరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆలయం ఆవరణంలో భక్తులు చెక్కభజనలు, కోలాటలతో మారుమ్రోగింది. స్వామివారి ఉత్సవవిగ్రహం ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అత్తర్‌చాంద్‌బాషాను ఈఓ సన్మానించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ అబ్దుల్‌ఖాదర్‌, ఆనంద్‌ ఉన్నారు. కదిరి ఆర్టీసీ  భక్తులకు ప్రత్యేక బస్సులు నడిపింది.  


అమడగూరు : శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి. మండ లంలోని సంజీవరాయుని కొండపైన పిచ్చిలి ఆంజనే యస్వామి, తుమ్మల కొండ వెంకటేశ్వరస్వామి, దొక్కల కొండ నరసింహ స్వామి, అమడగూరు చౌడేశ్వరీ దేవి ఆలయం, వివిధ గ్రామా ల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కుమ్మరిండ్లు సమీపం లో దొక్కల నరసింహ స్వామి ఆలయం వద్ద గోపాల్‌నాయక్‌ తండా వాసులు  నాలుగు వారాలపాటు భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.


నల్లమాడ : మండలవ్యాప్తంగా ఆలయాల్లో శ్రావణ మాసం సందర్భంగా మూడో శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దకోటపల్లి, నల్లమాడ, ఎద్దులవాండపల్లితండా, గోపేపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ  ఉత్సవాలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-14T05:14:10+05:30 IST