ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-07-02T06:26:45+05:30 IST

: రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ పరిసరాలు, గుడి చెరవు ప్రాంగణం, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంతంలో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు.

ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
గుడి చెరువు ప్రాంగణం పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

-  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

వేములవాడ, జూలై 1 : రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ పరిసరాలు, గుడి చెరవు ప్రాంగణం, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంతంలో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం  రాజన్న ఆలయం, గుడి చెరువు పరిసరాలను పరిశీలించారు.   స్వామివారి నిత్యకల్యాణం నిర్వహించే కళాభవన్‌, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణం కింద భారీ ఎత్తున మురుగు నీరు నిల్వ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఎక్కడా నీటి నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది దోమల నివారణ మందును చల్లారు. ఆయన వెంట ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఆలయ ఏఈవో జయకుమారి, డీఈ రఘునందన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-02T06:26:45+05:30 IST