భద్రాద్రి, యాదాద్రి దేవస్థానాల్లో దర్శనాలు బంద్

ABN , First Publish Date - 2021-05-12T00:02:59+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో భద్రాద్రి సీతారామ చంద్ర ఆలయం, యాదాద్రి దేవస్థానం వారు కీలక నిర్ణయం

భద్రాద్రి, యాదాద్రి దేవస్థానాల్లో దర్శనాలు బంద్

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో భద్రాద్రి సీతారామ చంద్ర ఆలయం, యాదాద్రి దేవస్థానం వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకూ భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనాలను నిలిపేస్తున్నామని దేవస్థానం అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఆంతరంగికంగా మాత్రం స్వామి నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని ఈవో శివాజీ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగానే ఈ నిర్ణయమని ఆయన ప్రకటించారు. 


యాదాద్రిలో కూడా....

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో యాదాద్రి దేవస్థానం వారు దర్శనాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. ఆంతరంగికంగా స్వామి వారి నిత్య కైంకర్యాలు మాత్రం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-12T00:02:59+05:30 IST