ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-22T05:50:28+05:30 IST

ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
383 సర్వే నెంబర్‌లో బోర్డు పాతుతున్న సర్పంచ్‌, గ్రామస్తులు

పరిగి, మే 21: దోమ మండలం దొంగఎన్కెపల్లిలోని సంజీవస్వామి ఆలయ భూములను శనివారం దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగరాజు, ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఈవో సుధాకర్‌ బృందం పరిశీలించింది. ఈ ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సర్పంచ్‌ అశోక్‌రెడ్డి ప లుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం అధికారుల బృందం ఆమ్రానికి వచ్చి భూములు చూశారు గానీ సర్వే చేయి ంచలేదు. దీంతో ఎండోమెంట్‌ అఽధికారుల తీరుపై సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌లు కృష్ణ, వెంకట్‌రెడ్డి, పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి 104 ఎకరాల భూమి ఉందని, ఆ భూమంతా ఇప్పుడు కబ్జాదారుల చేతుల్లో ఉందని తెలిపారు. దానికి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 383 సర్వే నెంబర్‌లోనే తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉందని, ఈ భూమి విలువ రూ.30కోట్లు ఉంటుందన్నారు. సమీప గ్రామాల్లో 90ఎకరాలకుపైగా ఉందని తెలిపారు. ఆలయం శిథిలావస్థకు చేరగా దానికింద కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురయ్యాయన్నారు. అధికారులు స్పందించి సంజీవస్వామి భూములను ఆలయానికి అప్పగించి ఆలయ పునర్వైభవానికి తోడ్పాటు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆలయ పరిరంక్షణ సమితి అధ్యక్షుడు కె.నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, రాంచందర్‌, సాయిరెడ్డి, పులిందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:50:28+05:30 IST