రూ.1,789 కోట్ల విలువైన Temple lands స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-24T13:15:35+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణకు గురైన 1789 కోట్ల విలువ చేసే ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. స్థానిక ఓట్టేరిలోని కందస్వామి ఆ

రూ.1,789 కోట్ల విలువైన Temple lands స్వాధీనం

                         - మంత్రి పీకే శేఖర్‌బాబు వెల్లడి


అడయార్‌(Tamilnadu): రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణకు గురైన 1789 కోట్ల విలువ చేసే ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. స్థానిక ఓట్టేరిలోని కందస్వామి ఆది మొట్టయమ్మన్‌ ఆలయ అభివృద్ధి పనులపై ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేవాదాయ శాఖ తరపున 342.38 ఎకరాలు, 317.2140 గ్రౌండ్ల స్థలం, 16.25 గ్రౌండ్ల కోనేరు స్థలాలతో కలుపుకుని మొత్తం 410 ఆక్రమణలను స్వాధీనం చేసుకున్నా మన్నారు. వీటి విలువ రూ.1,789 కోట్లని వివరించారు. కానీ, కొన్ని సంస్థలు డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపణలు చేయగా, మరికొందరు ఆక్రమణల తొలగింపుల్లో ఉన్న కొన్ని లోటుపాట్లను బూతద్దంలో చూపిస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. కానీ, ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి విమర్శలకు తన పనితీరుతో సమాధానమిచ్చారన్నారు. 

Updated Date - 2021-10-24T13:15:35+05:30 IST